Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెండు రోజుల్లో బాహుబలి2 దేశీయ కలెక్షన్లు 222 కోట్లు. 2 వరోజు వంద కోట్లు

బాహుబలి ది కంక్లూజన్ బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. దేశంలో విడుదలైన అన్ని భాషల్లో (హిందీ, తమళం, తెలుగు, మలయాళం) కలిపి శనివారం అంటే రెండో రోజు 100 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దీంతో రె

రెండు రోజుల్లో బాహుబలి2 దేశీయ కలెక్షన్లు 222 కోట్లు. 2 వరోజు వంద కోట్లు
హైదరాబాద్ , సోమవారం, 1 మే 2017 (09:50 IST)
బాహుబలి ది కంక్లూజన్ బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. దేశంలో విడుదలైన అన్ని భాషల్లో (హిందీ, తమళం, తెలుగు, మలయాళం) కలిపి శనివారం అంటే రెండో రోజు 100 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దీంతో రెండు రోజుల్లో దేశంలో 222 కోట్ల రూపాయల వసూళ్లతో అన్ని దేశీయ రికార్డులను చెరిపివేసింది. హిందీ ప్రాతంలో శుక్రవారం 40.75 కోట్లు, శనివారం 40 కోట్లు సాధించిన బాహుబలి 2 కేవలం రెండు రోజుల్లో 80.75 కోట్లు వసూలు చేసి షాక్‌కు గురి చేసింది.
 
దేశవ్యాప్తంగా సినిమా చూడటానికి జనం పోటెత్తడంతో ఎస్ ఎస్ రాజమౌళి తీసిన చిత్రం భారత్‌లో అత్యధిక కలెక్షన్లు సాధిస్తున్న చిత్రంగా దూసుకెళుతోంది. ప్రధానంగా ఉత్తరాది హీరోల చాక్‌లెట్ ముఖాలను, ముసలి ఖాన్ త్రయాన్ని పదే పదే చూసి విసుగెత్తిన హిందీ ప్రాంత జనం ప్రభాస్, రాణాల కండలు తిరిగిన భారీ దేహ ప్రదర్శనతో ఫిదా అవుతున్నారని సమాచారం. ఏ థియేటర్లో ఎవరిని పలకరించినా ఉత్తరాదిలో ఇప్పుడు వినిపిస్తున్న పేర్లు రాజమౌళి, ప్రభాస్, రానా. రాజమౌళి టెక్నో విజువలం వండర్‌కి నమూనాలుగా నిలిచిన ప్రభాస్, రానా ఇప్పుడు నిజంగానే ఉత్తరాదిన ఫ్రెష్ హీరోలుగా నిలిచిపోయారు.
 
తెలుగు ప్రాంతాల్లోనే కాదు. హిందీ ప్రాంతంలో కూడా బాహుబలి2 ని థియేటర్లో మాత్రమే చూడండి,. పైరసీ చూస్తే 80 శాతం ఒరిజినల్ ఫిలింని మీరు మిస్సయినట్లే అని ప్రేక్షకులు చెబుతున్నారంటే బాహుబలి దృశ్య అద్భుతం స్థాయి ఏమిటో అర్థమవుతుంది.
 
Second Day estimates
100 Crore nett approx All Languages ( Producer estimates)
40 Crore nett Producer Figure hindi
38.4 Crore  nett Trade Figure Hindi
 
Total India
221 Crore nett approx All Languages  ( Producer estimates)
81 Crore nett Producer Figure hindi
77.55 Crore nett  Trade Figure Hindi
 
Second Day estimates ( Producer sources)
Hindi: 40 Crore
Andhra/ Telangana: 36 Crore
Karntaka: 10 Crore
Tamil Nadu: 10 Crore
Kerala : 4 Crore
 
Total : 100 Crore

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిందీ బాహుబలి2 కి తగ్గని కలెక్షన్లు.. రెండో రోజూ 40 కోట్ల వసూళ్లు, ఆదివారం 48 కోట్లా?