Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మాగ్జిమ్' ముఖ చిత్రం ఫోటోలో దర్శనమిచ్చిన త్రిష

Advertiesment
'మాగ్జిమ్' ముఖ చిత్రం ఫోటోలో దర్శనమిచ్చిన త్రిష
, సోమవారం, 26 జులై 2010 (17:33 IST)
దక్షిణాది సెక్సీ తార త్రిష ఫోటోను ప్రముఖ మాగ్జిమ్ పత్రిక జులై సంచికలో కవర్ పేజీగా ప్రచురించింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని ఈ ఫోటోలను తీశారు. ఈ పత్రిక కోసం త్రిష హాట్ హాట్ ఫోజులిచ్చారు. 

బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రం కట్టా మీటాతో త్రిషా బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ఒక్క చిత్రంలో నటించే సరికి... బాలీవుడ్ వాతావరణం పూర్తిగా త్రిషకు వంటబట్టింది. ఆ మరుక్షణమే బ్లాక్ టాప్‌లు, బ్లాక్ షార్ట్స్‌తో యువతను వెర్రెక్కిస్తోంది.

మరి ఇంకెదుకు ఆలస్యం త్వరగా వెళ్లి త్రిషని కాదు.. కాదు.. త్రిష ఉన్న మ్యాగజైన్‌ను వెంటనే బుక్ చేసుకోండి. ఈ ఇష్యూలోనే తదుపరి బాలీవుడ్ హాట్ నటి వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu