Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ షోలను రాత్రి 11 తర్వాత ప్రసారం చేయండి: ప్రభుత్వం

ఆ షోలను రాత్రి 11 తర్వాత ప్రసారం చేయండి: ప్రభుత్వం
రియాల్టీ షోలపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తున్న నిరసనలపై ప్రభుత్వం స్పందించింది. ఇటువంటి షోలను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలలోపు ప్రసారం చేయాలని సమాచార, ప్రసారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న "బిగ్ బాస్", రాఖీ సావంత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న "రాఖీ కా ఇన్సాఫ్" షోలను ఈ సమయంలో ప్రసారం చేయాలని ఆ శాఖ కోరింది.

ఈ రెండు షోలు సార్వత్రిక ప్రదర్శన కోసం కాదని, ప్రతిపాదించిన సమయంలోనే వీటిని ప్రసారం చేయాలని సమాచార, ప్రసారాల శాఖ అధికారులు తెలిపారు. ఈ షోలను మరే ఇతర సమయంలోకానీ, లేదా వార్తా ప్రసారాలలో కానీ.. పున:ప్రసారం చేయకూడదని వారు స్పష్టం చేశారు.

కలర్స్ టివి ఛానెల్‌లో బిగ్ బాస్ ప్రసారమవుతుండగా.. ఇమాజిన్ టివి ఛానెల్‌లో రాఖీ కా ఇన్సాఫ్ ప్రసారమవుతుంది. అంతే కాకుండా.. ఎస్ఎస్ మ్యూజిక్ అనే టివి ఛానెల్ వారం రోజుల పాటు అశ్లీల దృశ్యాలు ప్రసారం చేసినందుకు గానూ.. ఆ ఛానెల్‌పై మంత్రిత్వ శాఖ నిషేధాన్ని విధించింది.

రాఖీ సావంత్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన రాఖీ కా ఇన్సాఫ్ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్‌ అనే కుర్రాడిని అవమానించి అతడి మృతికి కారణం కావడంతో.. దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఇటువంటి షోలను పూర్తిగా నిషేధించాలని మహిళా సంఘాలు ఆందోళన చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu