పులిని దత్తత తీసుకోనున్న బ్యూటీక్వీన్... దానికి అలా పెట్టాలని డిసైడ్ అయ్యిందట...
దత్తత అనగానే మనకు శ్రీమంతుడు చిత్రం గుర్తుకు వస్తుంది. తాజాగా ఇలాంటి దత్తతనే బాలీవుడ్ బ్యూటీ క్వీన్ జరీన్ ఖాన్ చేసుకుంది. ఇంతకీ ఆమె దత్తత తీసుకోవాలనుకుంటున్నది ఎవరిని అనకుంటున్నారు. ఓ పెద్దపులిని. అంటే... ఆ పెద్దపులిని పట్టుకెళ్లి ఇంట్లో పెట్టుకుని ద
దత్తత అనగానే మనకు శ్రీమంతుడు చిత్రం గుర్తుకు వస్తుంది. తాజాగా ఇలాంటి దత్తతనే బాలీవుడ్ బ్యూటీ క్వీన్ జరీన్ ఖాన్ చేసుకుంది. ఇంతకీ ఆమె దత్తత తీసుకోవాలనుకుంటున్నది ఎవరిని అనకుంటున్నారు. ఓ పెద్దపులిని. అంటే... ఆ పెద్దపులిని పట్టుకెళ్లి ఇంట్లో పెట్టుకుని దాన్ని పెంచడం వంటిదేమీ కాదు.
మరింకేం చేస్తుందంటే... తను దత్తత తీసుకునే పులికి కావాల్సిన ఆహారం, ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే దానికి వైద్య సేవలను అందించడమేనట. దీనినే జరీన్ దత్తత అని పిలుచుకుంటోంది. తనకు పులులు అంటే చాలా చాలా ఇష్టమనీ, అందువల్ల వాటిని సంరక్షించేందుకు తనవంతు కర్తవ్యంగా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. హౌస్ ఫుల్ 2 చిత్రంతో బాలీవుడ్ కుర్రకారును ఉర్రూతలూగించిన జరీన్... ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీపై టార్గెట్ పెట్టింది.