ముఖ్యమంత్రిగా ఎవరుండాలో మీరే చెప్పండి : ప్రజలకు అరవింద్ స్వామి పిలుపు
తమిళనాడు రాష్ట్రం ముఖ్యమంత్రి కుర్చీ కోసం సాగుతున్న ఆధిపత్య పోరుపై సినీ నటుడు అరవింద్ స్వామి స్పందించారు. రాష్ట్ర ప్రజలే తమ ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యయుతంగా ఎంపిక చేసుకోవాలని ఆయన ట్విట్టర్‌లో ట్వీ
తమిళనాడు రాష్ట్రం ముఖ్యమంత్రి కుర్చీ కోసం సాగుతున్న ఆధిపత్య పోరుపై సినీ నటుడు అరవింద్ స్వామి స్పందించారు. రాష్ట్ర ప్రజలే తమ ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యయుతంగా ఎంపిక చేసుకోవాలని ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
ప్రజలు తమ స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో వారి అభిప్రాయాన్ని గట్టిగా చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల నిర్ణయాన్ని ఎవరూ అంచనా వేయలేరని ఆయన అన్నారు. అన్ని నియోజకవర్గాల ప్రజలు తమ తమ ఎమ్మెల్యేలకు తమ నిర్ణయాన్ని గురించి చెప్పాలని ఆయన అన్నారు.
కాగా, అధికార అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు తీసుకునే నిర్ణయంతో సద్దుమణగనున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ స్వామి ట్వీట్ చేయడం గమనార్హం.