Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళ సినీపరిశ్రమపై జంట బాదుడు.. 'బొమ్మ' పడని థియేటర్లు.. స్పందించిన రజనీకాంత్...

తమిళ చిత్ర పరిశ్రమపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పన్నుల భారం మోపాయి. ముఖ్యంగా జీఎస్టీ పేరుతో కేంద్రం 28 శాతం మోపగా, వినోదపు పన్ను పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం పన్ను భారం మోపింది. దీంతో కేంద్

తమిళ సినీపరిశ్రమపై జంట బాదుడు.. 'బొమ్మ' పడని థియేటర్లు.. స్పందించిన రజనీకాంత్...
, బుధవారం, 5 జులై 2017 (16:07 IST)
తమిళ చిత్ర పరిశ్రమపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పన్నుల భారం మోపాయి. ముఖ్యంగా జీఎస్టీ పేరుతో కేంద్రం 28 శాతం మోపగా, వినోదపు పన్ను పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం పన్ను భారం మోపింది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుభారం 58 శాతానికి చేరింది. దీన్ని ఎంతమాత్రం అంగీకరించని తమిళాడు థియేటర్ వాణిజ్య మండలి, నిర్మాతల సంఘాలు కలిసి గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నాయి. 
 
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నును తక్షణం రద్దు చేయాలని కోరుతున్నాయి. ఇదే అంశంపై ఆందోళన చేస్తూ.. గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100కి పైగా థియేటర్లు మూతపడ్డాయి. అలాగే, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా వివిధ రూపాల్లో తమ నిరసనను, కామెంట్లను వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా ఈ పన్నుపై ఎట్టకేలకు స్పందించారు. తమిళనాడు వ్యాప్తంగా థియేటర్ల బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన సినిమా పరిశ్రమకు మద్దతుగా నిలిచారు. తమిళ చిత్ర పరిశ్రమలో లక్షలాది మంది ప్రజల గురించి ఆలోచించి తమ విన్నపాన్ని పరిగణించాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. 
 
కాగా, జీఎస్టీపై ఇప్పటికే కమల్ హాసన్, టి.రాజేందర్ వంటి సీనియర్ నటులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా టిక్కెట్లపై ప్రభుత్వం అదనపు పన్నువసూలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ముఖ్యంగా, జీఎస్టీ వచ్చిన తర్వాత కూడా వినోదం పన్ను అంటూ 'జంట బాదుడు' చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా థియేటర్ యాజమాన్యాలకు మింగుడు పడటం లేదు. జీఎస్‌టీని తాము వ్యతిరేకించడం లేదని, వినోదం పన్ను తీసేయాలని చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు, థియేటర్ యాజమాన్యాలు అంటున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిచ్చెక్కిస్తున్న యామీ గౌతమ్ వాటర్ యోగా... (Video)