ప్రభాస్ హీరోగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనే సినిమా చేయడం అనేది తెలిసిందే. కానీ షూటింగ్ ఏకదాటిగా తీయాలని దర్శకుడు తలంచాడు. కానీ మధ్యలో ప్రభాస్ రెండు సినిమాలు లైన్ వుండడంతో బిజీగా వున్నాడు. ఇప్పటివరకు సందీప్ రెడ్డి సినిమాల్లో యాక్షన్ తోపాటు వల్గారిటీ కూడా వుంటుంది. అర్జున్ రెడ్డి, యానిమల్ లో అవి స్పస్టంగా కనిపిస్తాయి. అందుకే స్పిరిట్ లో అవి లేకుండా జాగ్రత్త చూసుకోవాలని ప్రభాస్ చెప్పినట్లు తెలిసింది.
ఇందులో పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్నాడు ప్రభాస్. కనుక పోలీస్ లలో వుండే ఫెరేషియన్ కొన్ని బూతు డైలాగ్ లు మామూలుగా వుంటాయని చెప్పినట్లు సమాచారం. కానీ అందుకు ప్రభాస్ అంగీకరించలేదని టాక్ వుంది. ప్రభాస్ కోసం స్టైల్ మార్చుకుంటాడా..? లేక ప్రభాస్ కోసం సందీప్ స్టైల్ మార్చుకుంటాడా..? అనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు.