Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్-త్రివిక్రమ్ సినిమా.. పాట పాడనున్న కాటమరాయుడు.. హిట్ ఖాయం?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో లవ్, రొమాన్స్, సెంటిమెంట్, కామెడీతో పాటు యాక్షన్‌ సీన్లు వుంటాయి. ఈ సినిమాలో పవ

పవన్-త్రివిక్రమ్ సినిమా.. పాట పాడనున్న కాటమరాయుడు.. హిట్ ఖాయం?
, గురువారం, 13 జులై 2017 (09:24 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో లవ్, రొమాన్స్,  సెంటిమెంట్, కామెడీతో పాటు యాక్షన్‌ సీన్లు వుంటాయి. ఈ సినిమాలో పవన్ కోసం మూడు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేశాడని అంటున్నారు. ఈ యాక్షన్ సీన్స్ ఓ రేంజ్‌లు వుంటాయని టాక్. 
 
పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రానుండటంతో ఫ్యాన్స్‌కి సంతృప్తినిచ్చే విధంగా ఈ సినిమాను తెరకెక్కించాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో త్రివిక్రమ్-పవన్‌లకు హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు. ఇందులో పవన్ సరసన ఈ సినిమాలో కీర్తి సురేష్.. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 
 
ఇదిలా ఉంటే.. గబ్బర్ సింగ్, కాటమరాయుడు నిరాశపరచిన పవన్ కల్యాణ్.. త్రివిక్రమ్ సినిమాలో మరోసారి పాట పాడనున్నారట. అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడా పాటను పాడిన పవన్.. త్రివిక్రమ్ తాజా చిత్రంలోను ఓ పాట పాడనున్నట్లు సమాచారం. చిత్ర సంగీత దర్శకుడు అనిరుద్‌ రవిచంద్రన్ ఈ సాంగ్ కోసం మంచి బాణీలు రెడీ చేసాడని టాక్. హారిక అండ్ హాసిని బేనర్‌పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. 
 
మరోవైపు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా రిలీజ్ ముందే భారీ రేట్లు పలుకుతోంది. తాజా సమాచారం ప్రకారం జెమినీ టీవీ పవన్-త్రివిక్రమ్ సినిమా శాటిలైట్ రైట్స్‌ను రూ. 19.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వంటిపై ఆచ్చాదనే లేని హీరోయిన్.. అన్నీ వదిలేసిన అమీ