Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇక నుంచి సినిమాలు చేస్తా : బ్రీత్ టీజర్ లాంచ్ లో నందమూరి చైతన్యకృష్ణ

Advertiesment
Nandamuri Chaitanyakrishna, jayakrishan, Vamsi Krishna Akella
, శనివారం, 24 జూన్ 2023 (18:08 IST)
Nandamuri Chaitanyakrishna, jayakrishan, Vamsi Krishna Akella
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడైన నందమూరి జయకృష్ణ, బసవతారక రామ క్రియేషన్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసి, తొలి చిత్రంగా తన తనయుడు చైతన్యకృష్ణని హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న ఎమోషనల్ థ్రిల్లర్ 'బ్రీత్'. ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం టీజర్ ని లాంచ్ చేశారు మేకర్స్.
 
టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత నందమూరి జయకృష్ణ మాట్లాడుతూ.. 'బ్రీత్' ఎమోషనల్ థ్రిల్లర్. అన్ని వర్గాల వారిని అలరించేలా వుంటుంది. సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. మా అమ్మానాన్నల పేరుతో బసవతారక రామ క్రియేషన్స్‌ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఈ చిత్రాన్ని మా అమ్మానాన్నల అంకితం చేస్తున్నాను. నాన్నగారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేయడం ఆనందంగా వుంది'' అన్నారు.
 
హీరో చైతన్యకృష్ణ మాట్లాడుతూ.. వంశీకృష్ణ ఆకెళ్ళ గారు చక్కని కథ, కథనంతో ఈ చిత్రాన్ని మలిచారు. ప్రతి పాత్ర, సన్నివేశం అర్ధవంతంగా వుంటుంది. నా తొలి చిత్రానికి వంశీకృష్ణ లాంటి దర్శకులతో చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమా తో నాకు ఆయన బ్రీత్ ఇచ్చారు. హీరోయిన్ వైదిక అద్భుతంగా నటించింది. ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత వుంది. ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను అంటే దానికి కారణం మా నాన్నగారు. తాతగారు నాన్నమ్మ.. నాన్నగారు.. మీ అందరికీ ఆశీస్సులతో పరిచయం అవుతున్నాను. మీఅందరి బ్లెస్సింగ్స్ కావాలి''. ఇకనుంచి సినిమాలు చేస్తాను అన్నారు
 
దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ.. మా నిర్మాత జయకృష్ణ, హీరో చైతన్య కృష్ణలకి జీవితాంతం రుణపడివుంటాను. ఇంత మంచి థ్రిల్లర్ ని చేసే అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. బ్రీత్.. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. సినిమా చూస్తున్నపుడు షాక్, ఎక్సయిట్ మెంట్.  థ్రిల్ అన్నీ ఫీలవుతారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడిన యూనిక్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అన్నీ చైతన్యకృష్ణ. చైతన్య గారు అద్భుతమైన వ్యక్తి. జయకృష్ణ గారి నిర్మాణం సినిమా చేయడం నా అదృష్టం. ఆ అవకాశాన్ని విజయవంతమైన స్థాయికి తీసుకెళ్ళానని భావిస్తున్నాను. టీం అందరూ హార్డ్ వర్క్ చేశారు.ఖచ్చితంగా బ్రీత్ ప్రామెసింగ్ మూవీ అవుతుంది'' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వై. ఎస్. ఆర్. మరణం నుంచే వర్మ చూపిన వ్యూహం టీజర్‌- వర్మ నిజాలు చెప్పాడా! (video)