Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ఉయ్యాలవాడ" కథ చిరంజీవి స్వార్థ రాజకీయ జీవితానికి దర్పణమా?

ఎంతో ఆర్భాటంగా ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించి, కేవలం ఓ కేంద్రమంత్రి పదవి కోసం దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసేసారనే అపవాదుని మరింత కాలం మోయాల్సి ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీలో భాగంగా ఎంచుకున్

, బుధవారం, 12 ఏప్రియల్ 2017 (12:11 IST)
ఎంతో ఆర్భాటంగా ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించి, కేవలం ఓ కేంద్రమంత్రి పదవి కోసం దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసేసారనే అపవాదుని మరింత కాలం మోయాల్సి ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీలో భాగంగా ఎంచుకున్న రెండో సినిమా "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి" జీవితగాథ.
 
అసలు ఏంటా కథ...
ఇది సైనిక తిరుగుబాటుకు దాదాపు 10 సంవత్సరాల ముందే అంటే సుమారు 1847 కాలంలోనే జరిగినట్లు చరిత్ర చెపుతోంది. నరసింహారెడ్డికి ఇవ్వవలసిన సుమారు రూ.11 భరణాన్ని అతని అనుచరునికి ఇచ్చి పంపేందుకు బ్రిటీష్ తహసీల్దారు తిరస్కరించడంతో అవమానంగా భావించి, పోరాటం మొదలుపెట్టిన నరసింహారెడ్డితో స్థానికంగా ఉన్న ఇతర జమీందార్లు, బోయలు, చెంచులు కూడా చేరుతారు. కొన్ని దాడులు, ఖజానాలను కొల్లగొట్టడాలు వంటి వీరోచిత కార్యక్రమాల తర్వాత, క్లైమాక్సులో నరసింహారెడ్డిని బంధించి, 22 ఫిబ్రవరి, 1847లో బహిరంగంగా ఉరితీస్తారు అప్పటి కడప స్పెషల్ కమిషనర్ కార్యాలయ సిబ్బంది. భవిష్యత్తులో ఎవరు కూడా ఈ తరహా పోరాటాలు చేయకుండా, అసలు ఆ ఆలోచన రాకూడదనే విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా నరసింహారెడ్డి తలను 1877 వరకు అంటే 30 యేళ్ళపాటు కోయిలకుంట్లలోని ఉరికొయ్యకు వేలాడదీసి ఉంచారు. 
 
విక్టరీ వెంకటేష్‌ అతిథి పాత్ర, పరుచూరి బ్రదర్స్ పదునైన కలంతో పాటు దర్శకుడు ఎంతగా వినోదాన్ని, యాక్షన్‌ను మేళవించినా... తొలి తెలుగు తిరుగుబాటుదారుడు, వీరుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ అయినా ఇది చిరంజీవికి ఎంతమాత్రం నప్పుతుందనేదే ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు, రాజకీయ సర్కిల్స్‌‌లో జరుగుతున్న చర్చ. ముఖ్యమంత్రి అయిపోదామనే కలతో, ఎన్టీఆర్‌ పంథాలో స్వంతంగా పార్టీ పెట్టి, ఓ 18 మంది ఎమ్మేల్యేలను గెలిపించుకుని, తర్వాత మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా హస్తానికి లొంగిపోయి, రాష్ట్ర విభజన పుణ్యమా అని రాజకీయ వేషం చాలించేసి, 'ఖైదీ'గా ముఖానికి రంగేసేసుకున్నారు మెగాస్టార్. 
 
ఇప్పుడు మళ్లీ ఎంత పోరాటయోధుని కథైనా, తన స్వలాభం కోసమే పోరాటం మొదలుపెట్టిన ఉయ్యాలవాడ కథతో ఏం బావుకుంటారని చర్చ జరుగుతోంది. చిరంజీవి వ్యక్తిగత, రాజకీయ జీవితానికి ఈ కథ ఏమాత్రం లాభం చేకూర్చకపోగా, విమర్శకుల చేతిలో ఆయుధంగా మారుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నా, ఏదో ఒక తిరుగుబాటుదారుని కథలో హీరోగా నటించాలనే చిరంజీవి కోరికే నెగ్గుతోందట. గతంలో కూడా భగత్‌సింగ్ క్యారెక్టర్ చేయాలని ఉందని చిరంజీవి పేర్కొనడం విదితమే. మరి ఆ కథలో మసాలాలు, వినోదాలు దట్టించడం సాధ్యం కాకపోవడం వల్లనే ఏమో, ఉయ్యాలవాడను తెరకెక్కిస్తున్నారు. చూద్దాం... ఫలితం ఎలా ఉండబోతుందో.! 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిక్కెక్కిస్తున్న తమన్నా లుక్కు.. హాట్ అండ్ రెడ్ దుస్తుల్లో వయ్యారాలు...