వై ప్రభాస్ రిజెక్టెడ్ బాంబే పార్టీ... సిగ్గెక్కువ కదా.. అందుకూ....
బాలీవుడ్‌లో బాహుబలి-2ను విడుదల చేసిన నిర్మాత కరణ్ జోహార్ తన 20 ఏళ్ల సినీ జీవింతోనే కనీవినీ ఎరుగని విజయాన్ని బాహుబలి-2 చిత్రం ద్వారా సాధించారు. కేవలం 125 కోట్ల రూపాయలకు బాలీవుడ్ రైట్స్ కొనుక్కున్న కరణ
ఎవరీ ప్రభాస్.. బాహుబలి ది బిగినింగ్ సినిమా 2015లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినప్పుడు బాలీవుడ్ సినీ జనాలకు, బాంబే సెలెబ్రిటీలకు తలెత్తిన ప్రశ్న... ప్రభాస్ ఎవరు.. అప్పటికే రాజమౌళి అంటే మగధీర, ఈగ, మర్యాద రామన్న చిత్రాల ద్వారా బాలీవుడ్‌కు పరిచయమే. కానీ ఒక తెలుగు కుర్ర హీరో ఏంటి దేశమంతటా ఇంత గొప్ప విజయం సాధించడం ఏమిటి అనే ఆసక్తి తొలి భాగం విడుదలతో బాలీవుడ్ సెలెబ్రిటీ్స్‌లో కలిగింది. కానీ బాహుబలి ది కంక్లూజన్ విడుదల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కలిగిన సునామా కలెక్షన్లు ప్రభాస్ అంటే ఎవరో అందరికీ తెలిసేలా చేసింది.
ఇప్పుడు విషయం ఏదంటే బాలీవుడ్‌లో బాహుబలి-2ను విడుదల చేసిన నిర్మాత కరణ్ జోహార్ తన 20 ఏళ్ల సినీ జీవింతోనే కనీవినీ ఎరుగని విజయాన్ని బాహుబలి-2 చిత్రం ద్వారా సాధించారు. కేవలం 125 కోట్ల రూపాయలకు బాలీవుడ్ రైట్స్ కొనుక్కున్న కరణ్ ఇప్పటికే ఈ సినిమా ఒక్క హిందీ ప్రాంతంలోనే 300 కోట్లకు చేరుకోవడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. బాలీవుడ్ కల్లో కూడా ఊహించని విజయం సాధించిన కరణ్ దీంతో బాలీవుడ్‌కు కరణ్ జోహార్ భారీ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. ఈ పార్టీకి బాలీవుడ్ ప్రముఖులతో పాటు ప్రముఖ మీడియా ప్రతినిధులను కూడా కరణ్ పెద్ద స్థాయిలో ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.
కానీ ఇప్పటికే రాజమౌళి స్వయంగా ఆహ్వానించినా లండన్‌లో బాహుబలి-2 ప్రత్యేక ప్రీమియంకు హాజర్ కాని ప్రభాస్ కరణ్ జోహార్ ఇస్తున్న బాంబే పార్టీకి కూడా హాజరు కాబోవటం లేదని సమాచారం. ఈ పార్టీకి ప్రభాస్‌ను కూడా కరణ్ జోహార్ స్వయంగా ఆహ్వానించారట. రెండు రోజుల పాటు బ్రేక్ ఇచ్చి పార్టీలో పాల్గొనాలని కరణ్ చెప్పినా అందుకు ప్రభాస్ అంగీకరించలేదట.
పైగా, అమెరికా నుంచి వచ్చాకైనా ఏ తేదీ తనకు వీలుగా ఉంటుందో.. ఆ తేదీనే పార్టీ ఏర్పాటు చేస్తానని కరణ్ చెప్పినా.. అమరేంద్ర బాహుబలి సున్నితంగా తిరస్కరించారట. తనకు పార్టీలంటే పెద్దగా ఇష్టం ఉండదని రాజమౌళి, కరణ్ జోహార్‌లకు ప్రభాస్ సాకు చెప్పాడట. దీంతోఅమెరికా టూర్ చెప్పి అటు రాజమౌళి, ఇటు కరణ్ జోహార్ల రిక్వెస్ట్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాడో అర్థంకాక మీడియా పలురకాలైన కథనాలు రాస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వై ప్రభాస్ రిజెక్టెడ్ బాంబే పార్టీ అంటూ కొత్త ప్రశ్న పుట్టుకొచ్చింది. కాని రాజమౌళిని, కరణ్‌ని అగౌరవపర్చడం ప్రభాస్ ఉద్దేశం కాకపోవచ్చని బాహుబలి సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. వారు చెబుతున్నదాని ప్రకారం ప్రభాస్ చాలా బిడియస్తుడు. పైగా పార్టీ కల్చర్‌కు అతడు చాలా దూరంగా ఉంటాడని కూడా తెలుస్తోంది. మహిళలతో మాట్లాడటం అన్నా, పదిమంది కూడిన చోట మాట్లాడాలన్నా ప్రభాస్ బాగా సిగ్గుపడతాడని, మాట రాదని ఇటీవల కూడా చాలాసార్లు అనుభవమైంది. ఇక బాలీవుడ్ సెలబ్రిటీస్ సమక్షంలో ప్రభాస్ మాట్లాడటం అసంభవం అని తన సన్నిహితులు చెబుతున్నారు. పైగా రానాతో పోల్చుకుంటే అటు ఇంగ్లీషులో, ఇటు హిందీలో కూడా ప్రభాస్ పెద్దగా మాట్లాడలేడు.
దీంతో తనలో తొలి నుంచి ఉన్న ఈ బిడియం, దానికి తోడు భాషా సమస్య కూడా ప్రభాస్‌ను సెలబ్రిటీలు ఉన్న పార్టీలకు దూరం చేస్తోందని, అంతే తప్ప కరణ్, రాజమౌళి ఆహ్వానాలను తిరస్కరించడం కాదని ప్రభాస్ సన్నిహితులు చెబుతున్నారు. ఇదే నిజమైతే ప్రభాస్ వ్యక్తిగత నిర్ణయాన్ని పెద్దగా అనుమానించాల్సిన పని లేదు కదా.