Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దర్శకధీరుడు రాజమౌళికి ఎర్త్ పెడుతున్న డైరక్టర్ ఎవరు?... శభాష్ అంటూ మెచ్చుకున్న జక్కన్న!

టాలీవుడ్‌లో దర్శక ధీరుడుగా ఎస్ఎస్ రాజమౌళి పేరు కొట్టేశాడు. తన మొదటి చిత్రం స్టూడెంట్ నంబర్ 1 చిత్రం నుంచి నిన్నటి బాహుబలి చిత్రం వరకు తన ప్రత్యేకతను చాటుతూ విజయపథంలో దూసుకెళుతున్నాడు.

దర్శకధీరుడు రాజమౌళికి ఎర్త్ పెడుతున్న డైరక్టర్ ఎవరు?... శభాష్ అంటూ మెచ్చుకున్న జక్కన్న!
, శనివారం, 17 డిశెంబరు 2016 (11:08 IST)
టాలీవుడ్‌లో దర్శక ధీరుడుగా ఎస్ఎస్ రాజమౌళి పేరు కొట్టేశాడు. తన మొదటి చిత్రం స్టూడెంట్ నంబర్ 1 చిత్రం నుంచి నిన్నటి బాహుబలి చిత్రం వరకు తన ప్రత్యేకతను చాటుతూ విజయపథంలో దూసుకెళుతున్నాడు. తొలి చిత్రంతో విట్ తర్వాత 'మగధీర' సినిమాతో మరో ఎత్తుకి ఎదిగాడు. ఇక బాహుబలితో అయితే తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలల్లా వ్యాపింపచేశాడు. 
 
ప్రస్తుతం దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో తెలుగులో రాజమౌళి, తమిళంలో శంకర్‌లు టాప్ డైరక్టర్లుగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు స్థాయిని పెంచే సినిమాలతో ముందుకొస్తున్నారు. అయితే అనూహ్యంగా తెలుగులో రాజమౌళికి పోటీగా ఓ దర్శకుడు పుట్టుకొచ్చాడు. అతనే డైరక్టర్ జాగర్లమూడి క్రిష్.. 'గమ్యం', 'వేదం', 'కృష్ణం వందే జగద్గురుం', 'కంచె' ఇలా తన ప్రతి సినిమాను ఓ ప్రత్యేకతతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 
 
దీంతో రాజమౌళికి సరైన మొగడు క్రిష్ అనే టాక్ వినిపిస్తోంది. పోటీ అనుకున్నా.. అనుకోక పోయినా సరే... జక్కన్నకు మించి సినిమాలు తీస్తున్నాడు. ఫలితంగా.. ఏదో ఒక రోజున జక్కన్నను మించిపోయే దర్శకుడిలా క్రిష్ అందరి కళ్ళకు కనిపిస్తున్నాడు. ప్రతి సినిమాలోనూ క్రిష్ చూపించే క్రియేటివిటీ అదరహో అనేలా ఉంది. 
 
ఇక "గౌతమీపుత్ర శాతకర్ణి" ట్రైలర్ చూస్తే క్రిష్ దర్శకత్వ ప్రతిభ ఏంటో ఇట్టే తెలుసుకోవచ్చు. బాలకృష్ణ వందో సినిమా ఎలా ఉండాలని ఊహించాడో ఏమాత్రం అంచనాలను తగ్గకుండా సినిమా తీశాడనిపిస్తుంది. ఇక ట్రైలర్ చూస్తుంటే మరో బాహుబలినా అన్నంతలా ఉంది. కేవలం 8 నెలల్లో ఇలాంటి గొప్ప సినిమా తీయడం అంటే కష్టమే అందుకే రాజమౌళి సైతం క్రిష్ హ్యాట్సాఫ్ అనేశాడు. సో తనకు పోటీ దారుడు క్రిష్ అని జక్కన్న కూడా ఒప్పుకున్నట్టే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నిజమైన కత్తికన్నా మెగా షార్ప్ ట్రైలర్‌గా గౌతమీపుత్ర ట్రైలర్.. అసూయపుట్టిందంటున్న రాంగోపాల్ వర్మ