నా వ్యక్తిగత జీవితంపై వాళ్ళకు ఎందుకంత ఆరాటం - ప్రభాస్

మంగళవారం, 27 ఆగస్టు 2019 (22:15 IST)
మనకు కొన్ని విలువలు ఉంటాయి. మనమేంటో పదిమందికి తెలిసినప్పుడు.మన గురించి ఎంత మంది చెడు ప్రచారం చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు నమ్మరు కాబట్టి. నేను కూడా అదే నమ్ముతున్నా. పాటిస్తున్నాను. దయచేసి నా వ్యక్తిగతం గురించి ప్రశ్నలు అడగవద్దండి.
 
నా పెళ్ళి, నా జీవితం, అనుష్కతో నా పరిచయం.. ఇదంతా పూర్తిగా నా వ్యక్తిగతమే. దయచేసి దీన్ని పెద్దది చేయొద్దండి. ఆ విషయాలను చర్చించడం మానుకోండి. నా వ్యక్తిగత జీవితం తెలుసుకోవడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. అలాంటి నాకు ఇష్టం లేదు. 
 
అలాంటి వాటికి ఆరాటపడకండి.. మనకంటూ కొన్ని విలువలు ఉంటాయని డార్లింగ్ ప్రభాస్ స్ట్రాంగ్‌గా అభిమానులను వార్నింగ్ ఇచ్చారు. సాహో సినిమా ఈనెల 30వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తోంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కమల్ హాసన్ దెబ్బకు తట్టుకోలేక సినిమా నుంచి తప్పుకున్న హీరోయిన్..