Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉయ్యాలవాడలో ముగ్గురు హీరోయిన్లా.. నేషనల్‌కి ఐశ్వర్యారాయ్, ఇంటర్నేషనల్‌కి ప్రియాంక.. అది చరిత్రేనా..

ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటం జరగడానికి పది సంవత్సరాల ముందే రాయలసీమలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అసువులు బాసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను చిరంజీవి హీరోగా పెట్టి తీయాలని మెగా ఫ్యామిలీ నిర్ణయించినప్పటినుంచి దానిమీద జరుగుతున్న హ

Advertiesment
ఉయ్యాలవాడలో ముగ్గురు హీరోయిన్లా.. నేషనల్‌కి ఐశ్వర్యారాయ్, ఇంటర్నేషనల్‌కి ప్రియాంక.. అది చరిత్రేనా..
హైదరాబాద్ , సోమవారం, 19 జూన్ 2017 (08:07 IST)
చారిత్రక, కాల్పనిక, ఫాంటసీ కథలకు ఇప్పుడు స్వర్ణయుగం వచ్చేసినట్లే.. గౌతమీపుత్ర శాతకర్ణి, తర్వాత బాహుబలి 2 సినిమాలు  కనకవర్షం కురిపించడంతో చరిత్రకు, కల్పనకు భారీతనాన్ని అద్దితే ఘనవిజయాలు సాధ్యమవుతాయని అందరికీ తెలిసిపోయింది. ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటం జరగడానికి పది సంవత్సరాల ముందే  రాయలసీమలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అసువులు బాసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను చిరంజీవి హీరోగా పెట్టి తీయాలని  మెగా ఫ్యామిలీ నిర్ణయించినప్పటినుంచి దానిమీద జరుగుతున్న హైప్ ఇంతా అంతా కాదు. 
 
కానీ కల్పన, ఫాంటసీలకు దూరంగా ఫక్తు చరిత్రకు సంబంధించిన వీరుడి గాథను సినిమాగా తీయాలనుకుంటున్నప్పుడు భారీ కలెక్షన్లు రాబట్టే దృష్టితో ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల కోసం వేట మొదలెట్టారని వస్తున్న వార్తలు ఉయ్యాలవాడ చరిత్రను పక్కా కమర్షియల్‌గా, మసాలాలు కలిపి తీస్తున్నారా అనే నిరాశ కలుగుతోంది. పైగా ప్రాంతీయ లుక్‌కు ఒకరు, జాతీయ లుక్‌కి ఒకరు, ఇక అంతర్జాతీయ లుక్‌కి మరొకరు ఇలా ముగ్గురు హీరోయిన్ల కోసం దుర్భిణిలో వేసి గాలిస్తున్నారని తాజా వార్తలు
 
అనుష్కా శెట్టి, ప్రియాంకా చోప్రా మనసుల్లో ఉయ్యాలవాడలోకి రావాలనుందో లేదో గానీ... వీళ్లిద్దర్నీ తీసుకురావాలని చిరంజీవి అండ్‌ కో తీవ్రంగా ప్రయత్నిస్తుందని ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మించనున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’లో ముగ్గురు కథానాయికలకు చోటుంది. మామూలు కమర్షియల్‌ సినిమా అయితే... ఎవరో ఒకర్ని ఎంపిక చేసే వీలుంటుంది. కానీ, ఇదేమో చారిత్రక కథతో రూపొందనున్న సినిమా.
 
అందుకే, ఆచి తూచి అడుగులు వేస్తున్నారట! ఆల్రెడీ ఓ హీరోయిన్‌ క్యారెక్టర్‌కు ఐశ్వర్యారాయ్‌ను సంప్రదించారనే వార్త షికారు చేస్తోంది. మిగతా ఇద్దరు హీరోయిన్ల పాత్రలకు అనుష్క, ప్రియాంకలను సంప్రదించారట! ‘బాహుబలి, రుద్రమదేవి’ సినిమాలతో చారిత్రక సినిమాలకు అనుష్క పర్‌ఫెక్ట్‌ అనే పేరొచ్చింది. పైగా, ‘స్టాలిన్‌’లో చిరు పక్కన ఓ సాంగ్‌ చేసినప్పుడు ఇద్దరి జోడీ బాగుందన్నారు. ఆల్రెడీ అనుష్కను ‘ఉయ్యాలవాడ..’ టీమ్‌ అప్రోచ్‌ అయ్యారట. 
 
ఐష్‌తో పాటు మరో హీరోయిన్‌ పాత్రకు ప్రియాంకను తీసుకుంటే సినిమాకు ఇంటర్నేషనల్‌ లుక్‌ వస్తుందనుకుంటున్నారట. మరి, వీళ్లు ఏమంటారో వీళ్లతో పాటు ‘లింగ’లో రజనీకాంత్‌కు జోడీగా నటించిన హిందీ హీరోయిన్‌ సోనాక్షీ సిన్హా పేరు కూడా పరిశీలనలో ఉందట! సినిమా సెట్స్‌పైకి వెళ్లేసరికి ఎవరు ఫైనలైజ్‌ అవుతారో!!
 
ఈ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ లుక్స్ గొడవ ఏంటో గానీ. ఉయ్యాలవాడలో మనం చూసేది చరిత్రా లేక ముగ్గురు హీరోయిన్ల చుట్టూ హీరో పరుగెత్తుతున్న ప్రేమాయణమా అనేది అంతుబట్టకుండా ఉండేది. ఈ సందర్భంగా బాహుబలిని కొట్టే సినిమా తీద్దామని బయలు దేరి ఇంకో బలిని తీస్తే ఉట్టి మునగడం ఖాయం అని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ గారు చేసిన హెచ్చరికను కాస్త దృష్టిలో పెట్టుకుంటే అందరికీ మంచిదేమో.. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంఘమిత్రకు ఎవరూ దొరకలేదట.. అనుష్క వద్దంది.. నయనతారను అడుక్కుంటున్నారు