బాలీవుడ్, కొలీవుడ్ అంటే పడి చస్తారు. తెలుగు అమ్మాయిలంటే ఆమడ దూరం ఉంటారెందుకు?
బాలీవుడ్ నుంచి, కొలివుడ్ నుంచి చివరకు శాండిల్ వుడ్ నుంచి కూడా ఎవరైనా తెల్లమ్మాయి వచ్చేసి నాలుగు డైలాగులు కొ్ట్టి ఒళ్లు చూపిస్తేచాలు.. తెలుగు సినీ పరిశ్రమ వారికి బ్రహ్మరథం పడుతోంది. కానీ మన తెలుగు పరిశ
బాలీవుడ్ నుంచి, కొలివుడ్ నుంచి చివరకు శాండిల్ వుడ్ నుంచి కూడా ఎవరైనా తెల్లమ్మాయి వచ్చేసి నాలుగు డైలాగులు కొ్ట్టి ఒళ్లు చూపిస్తేచాలు.. తెలుగు సినీ పరిశ్రమ వారికి బ్రహ్మరథం పడుతోంది. కానీ మన తెలుగు పరిశ్రమ.. మనల్ని ఆదరించకపోతుందా అని కొండంత ఆశలతో వస్తున్న కొద్దిమంది అమ్మాయిలకు కూడా టాలీవుడ్ చుక్కలు చూపిస్తోంది ఎందుకు. ఎవరైనా తెలుగు అమ్మాయీ హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసినా తర్వాత సినిమానాటికి అలాంటివారు అడ్రస్ లేకుండా పోతున్నారు. కారణం ఏమిటి. మన అమ్మాయిలకు నటన తెలీదా, గ్లామర్ పండించడం తెలీదా.. లేక గాడ్ ఫాదర్లు ఎవరూ లేరా..నిన్నకాక మొన్న వచ్చిన సాయిపల్లవి టాలీవుడ్ అదిరిపోయే ప్రదర్శన ఇచ్చి మిగిలిన హీరోయిన్లకు వణుకు పుట్టిస్తోంది. అదీ సంవత్సరం లోపే తెలుగు నేర్చుకుని తనకు తానే డబ్బింగ్ చెప్పుకునేంత స్థాయికి ఈ తమిళ అమ్మాయి ఎదిగిపోయింది. తెలుగు వారు అలా నటించలేరా.. వాళ్లలో ఆకర్షణ లేదా.
ఎంతోమంది తెలుగు అమ్మాయిలు కొత్తగా హీరోయిన్ వేషాల కోసం వస్తున్నా వారికి ఎక్కువ అవకాశాలు లేవని తెలుగు హీరోయన్ ఈషా విచారం వ్యక్తం చేస్తోంది. తెలుగు అమ్మాయిలు ఏం చెప్పినా వెలుగులోకి రాదు. కానీ బాలీవుడ్ హీోయిన్ వచ్చేసి ప్రభాస్‌తో నటించాలని ఉంది అంటే చాలు అది వైరల్ అయిపోతోంది. ఈ తేడా ఎందుకు అంటూ ఈషా ప్రశ్నిస్తోంది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే..
‘‘టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువమంది ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే కొత్త హీరోయిన్లు వస్తున్నారు. తెలుగు హీరోయిన్లకు ఎక్కువగా ఆప్షన్స్ ఉండటం లేదు. ఎందుకో నాకు తెలీదు. అయినా తెలుగు అమ్మాయిలు ఏం చెప్పినా హైలెట్ అవ్వదు. అదే ఏ బాలీవుడ్ హీరోయినో ప్రభాస్ పక్కన చేస్తానంటే అది హైలైట్ అయిపోతుంది’’ అన్నారు ఈషా. అశోక్, ఈషా జంటగా హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్శకుడు’. విజయ్‌కుమార్, థామస్, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 4న విడుదల కానుంది.
‘దర్శకుడు’ సినిమాకి ఆడిషన్స్ జరిగిన వెంటనే నన్నీ సినిమాలోకి తీసుకోలేదు. మూడు నెలల తర్వాత దర్శకుడు హరిప్రసాద్ నుంచి కబురొచ్చింది. తర్వాత డైరెక్టర్ సుకుమార్‌ను, చిత్రయూనిట్‌ను కలవడం జరిగింది. ఈ సినిమాలో నేను పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకునే నమ్రత అనే అమ్మాయి క్యారెక్టర్‌లో నటించాను. డైరెక్టర్ కావాలనుకునే హీరోను నమ్రత కలుస్తుంది. వారిద్దరి మధ్య రిలేషన్ ఎలా సాగింది చివరికి వారి జీవితాలు ఎలా ఎండ్ అయ్యాయి అన్నదే చిత్రకథ.
ఛాన్స్ వస్తే డైరెక్టర్ సుకుమార్‌గారి సినిమాలో తప్పకుండా చేస్తాను. ఆయన ఈ సినిమా సెట్స్‌కు రాలేదు. ఒకసారి ఆయన బంధువుల ఫంక్షన్‌లో నేను కలిశా. అప్పుడు సుకుమార్‌గారు ‘దర్శకుడు’ సినిమా, నా నటన చాలా బాగుందని మెచ్చుకోవడం ఆనందంగా అనిపించింది. నా సినీ జర్నీలో గ్యాప్ అంతగా రాలేదు. ‘అంతకు మందు ఆ తరువాత’ సినిమా తర్వాత ‘బందిపోటు’లో యాక్ట్ చేశాను. వెంటనే ఓ తమిళ సినిమా చేశాను.
గత ఏడాది ‘మాయమాల్’, ‘దర్శకుడు’ సినిమాలు స్టార్ట్ అయ్యాయి. ‘అమీ తుమీ’ ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టారై, జూన్‌లో విడుదలైంది. ఛాలెంజింగ్ క్యారెక్టర్లు చేయడానికి ఇష్టపడతాను. ఉదాహరణకు ‘ఫిదా’లో భానుమతి (సినిమాలో సాయి పల్లవి పాత్ర పేరిది) క్యారెక్టర్ వస్తే తప్పకుండా చేస్తా. స్టార్ హీరోలతో అని కాదు అందరి హీరోలతో సినిమాలు చేయాలని ఉంది. కానీ, పెద్దగా అవకాశాలు రావడం లేదు.