Vijay Devarakonda Cool Mode
కథానాయకులు సినిమా సినిమాకు అవసరాన్ని బట్టిబాడీని స్లిమ్ గా వుంచుకుంటారు. మరింత లావు అయ్యేలా చూసుకుంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూల్ మోడ్ లో వున్నట్లు గతానికి ఇప్పటికి ఆయన బాడీలో చాలా తేడా కనిపిస్తుంది. ఇలా కావడానికి తను ప్రస్తుతం చేస్తున్న 12వ సినిమా కోసం క్యారెక్టర్ ను మార్చుకున్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది. కానీ బయట మాత్రం సినిమాలు తగ్గడంవల్ల కాస్త డల్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి టైంలో ఆయన మనోదైర్యంతో ముందుకు సాగాలని మరికొందరు పేర్కొంటున్నారు. అప్పట్లో లైగర్ డిజాస్టర్ అయ్యాక ఆ తర్వాత చేయాల్సిన జనగనమన పాన్ ఇండియా సినిమా ఒక్కసారిగా అటకెక్కింది.
ఇక తాజా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రంలో విజయ్ నటిస్తున్నాడు. ఇందుకోసం చాలా కసరత్తు చేస్తున్నాడని తెలిసింది. ఇటీవలే సారధి స్టూడియోలో ఇందుకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారు. నేడు కూడా ఈ సినిమాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగబోతోంది. నాయికగా శ్రీలీల నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. మరోవైపు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన తెలుగు పీరియడ్ రాబోయే యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కూడా విజయ్ కమిట్ అయ్యాడు.