`కొత్తగా మా ప్రయాణం` ఫేమ్  ఈశ్వర్ హీరోగా, నైనా సర్వర్ హీరోయిన్ గా `కథనం` ఫేమ్ నాదెండ్ల రాజేష్ దర్శకత్వంలో యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్.ఎస్ రావు, విష్ణువర్ధన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న  మాస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "సూర్యాపేట జంక్షన్" ఈ చిత్ర టీజర్ నీ హీరో ఈశ్వర్ విడుదల చేశారు.
 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ.. ఈరోజు చిత్ర టీజర్ నీ విడుదల చేయడం ఆనందంగా ఉంది.  టీజర్ చూసిన వారు చాలా బాగుంది అంటుంటే మా కష్టానికి ఊపిరి పోసినట్లు అనిపించింది. నా కథని నమ్మి రాజేష్ నాతో రెండున్నర సంవత్సరాలు జర్నీ చేశారు ఈ ఔట్ పుట్ రావడానికి కారణం అయిన మా డైరెక్టర్ గారికి మా టీమ్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు.
	 
	సూర్యా పెట్ జంక్షన్ మూవీ ని ఒక యదార్థ కథతో సినిమాటిక్ గా మలుచుకుని సినిమా పూర్తి చేసాము. హీరోయిన్ నైన సర్వల్, మాతోటి ఆర్టిస్టులు  ఒక్కొకరు ఎవరి పాత్రలో వాళ్ళు బాగా చేశారు. మా టెక్నీషిన్స్ అందరి సమిష్టి కృషి. త్యరలో విడుదల తేదీ ప్రకటిస్తాము అని తెలిపారు. 
	 
	హీరోయిన్ నైన సర్వార్  మాట్లాడుతూ, సూర్యా పెట్ జంక్షన్ టీజర్ చాలా నచ్చింది. ఈ సినిమా వల్ల  నేను వంటలు నేర్చుకున్నాను. నాకు ఈ చిత్రం మంచి సక్సెస్ అవుతుంది అని నమ్మకం గా ఉంది అన్నారు. 
	 
	 ప్రొడ్యూసర్ నల్ల పల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సినిమా బాగా వచ్చింది మీకు టీజర్ చూస్తే అర్దం అయ్యే ఉంటుంది మా డైరెక్టర్ హీరో హీరోయిన్ ఆర్టిస్ట్స్ టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు ఈ చిత్రం చాలా మంచి సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాను. అన్నారు.