''శివాయ్'' పబ్లిసిటీ కోసం రియాల్టీ షోకు అజయ్.. శిల్పాశెట్టికి బొద్దింకల గిఫ్ట్.. పారిపోయింది...
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ''శివాయ్''. ఈ చిత్రంలో అజయ్ సరసన సాయేషా సైగల్ జంటగా నటిస్తుండగా.. దిలీప్ కుమార్, సైరా భానులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది దీప
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ''శివాయ్''. ఈ చిత్రంలో అజయ్ సరసన సాయేషా సైగల్ జంటగా నటిస్తుండగా.. దిలీప్ కుమార్, సైరా భానులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది. అయితే ఈ మూవీ పబ్లిసిటీలో భాగంగా అజయ్ ముంబైలో సూపర్ డ్యాన్సర్ రియాల్టీ షోలో పాల్గొన్నాడు. ఈ షోకి బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, కొరియోగ్రాఫర్ గీతా కపూర్, అనురాగ్ బసులు జడ్జీలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అజయ్ షోకి వస్తూ శిల్పకి, గీతా కపూర్‌కి బహుమతులు తెచ్చాడు.
ఈ కార్యక్రమంలో శిల్పా శెట్టికి అజయ్ ఓ గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ బాక్స్ లో ఏముందోనని ఆత్రుతగా తెరచి చూసిన శిల్పాశెట్టి అందులో ఉన్న బొద్దింకలను చూసి గట్టిగా కేకలు పెట్టింది. బాక్సులో ఉన్న బొద్దింకల గుంపును ఒక్కసారిగా చూడడంతో భయంతో పాటు షాక్‌కు గురైంది. నిజం బొద్దింకలు కాదు బొమ్మలే అయినా శిల్ప వాటిని చూసి ఎంత భయపడిందంటే.. వేదిక మీదినుంచి వెళ్లిపోయింది. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తేరుకుంది. అనంతరం రియాల్టీ షోలో జడ్జిగా మళ్లీ పాల్గొంది. అయితే, బాక్సులో ఉన్నవి నిజమైన బొద్దింకలు కావని, బొద్దింకల బొమ్మలే అని షో నిర్వాహకులు తాపీగా చెప్పడం విశేషం.