Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

నవంబర్ 1న ఇటలీలో వివాహం.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్

Advertiesment
Varun Tej
, శుక్రవారం, 27 అక్టోబరు 2023 (10:15 IST)
Varun Tej
అందాల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలో మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ భార్య కాబోతోంది. ఇప్పటికే చిరంజీవి, అల్లు అర్జున్‌లు పెళ్లికి ముందు కొన్ని పార్టీలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 1న ఇటలీలో వీరి వివాహం జరుగనుంది. 
 
ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారు.ఈ నేపథ్యంలో పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రహ్మాండమైన ఈ వివాహ ఆహ్వానపత్రిక పైన 'VL' చిహ్నం ఉంది. ఆహ్వానంలో ‘కొణిదెల ఆహ్వానం’ తర్వాత "శ్రీమతి అంజనాదేవి అండ్ స్వర్గీయ శ్రీ కొణిదెల వెంకట్ రావు, స్వర్గీయ శ్రీమతి సత్యవతి, శ్రీ ఎం సూర్యనారాయణ ఆశీస్సులతో"అని ఉంది. 
 
శ్రీమతి అండ్ శ్రీ కొణిదెల చిరంజీవి, శ్రీమతి అండ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్, శ్రీమతి అండ్ శ్రీ కొణిదెల రామ్‌చరణ్ నుండి "బెస్ట్ కాంప్లిమెంట్స్" భాగం హైలైట్‌గా మిగిలిపోయింది. అసలు ఆహ్వానం ఇలా ఉంది.. శ్రీమతి పద్మజ అండ్ శ్రీ కొణిదెల నాగబాబు, లావణ్య త్రిపాఠి (శ్రీమతి కిరణ్ అండ్ శ్రీ దేవరాజ్ త్రిపాఠి కుమార్తెలు)తో తమ ముద్దుల కుమారుడు వరుణ్ తేజ్ వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించడం వుంది. 
 
రిసెప్షన్ వెడ్డింగ్ కార్డు గులాబీ రంగులో రూపొందించబడింది. అది 'రిసెప్షన్ - ఆదివారం 05 నవంబర్ 2023' అని రాసి ఉంది. ఈ వేదిక మాదాపూర్ హైదరాబాద్‌లోని ఎన్-కన్వెన్షన్ అని పేర్కొంది. వివాహ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.
 
అక్టోబర్ 30వ తేదీ రాత్రి ఇటలీలోని టుస్కానీలో ఈ జంట కాక్టెయిల్ పార్టీని నిర్వహించనున్నారు. మెహందీ, హల్దీ వేడుకలు అక్టోబర్ 31న జరుగుతాయి. తర్వాత నవంబర్ 1న వివాహ వేడుక జరుగుతుంది.


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లోని 'ఐరెనే వంచాలా ఏంటి..?' డైలాగ్