Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ritika Nayak : సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్లం : రితికా నాయక్

Advertiesment
Ritika Nayak

దేవీ

, బుధవారం, 10 సెప్టెంబరు 2025 (17:34 IST)
Ritika Nayak
నా తొలి చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ కోసం చూస్తున్నప్పుడు మిరాయ్  అవకాశం వచ్చింది.  అద్భుతంమైన కథ. నా క్యారెక్టర్ చాలా నచ్చింది. ఈ సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను. చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా చేశాం.ఫైనల్ గా సినిమా ఆడియన్స్ కి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది అని హీరోయిన్ రితికా నాయక్ అన్నారు.
 
హీరో తేజ సజ్జా చిత్రం మిరాయ్‌. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా రితికా నాయక్ సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ?
 చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను. హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్. తనలో గ్రేట్ ఎనర్జీ ఉంటుంది. ఇందులో నా క్యారెక్టర్ గురించి అప్పుడే ఎక్కువ రివిల్ చేయకూడదు.  మిరాయ్ లో యాక్షన్ అడ్వంచర్ ఆడియన్స్ గొప్ప అనుభూతిని ఇస్తుంది.
 
- ఈ సినిమాలో జగపతిబాబు గారితో కలిసి వర్క్ చేయడం కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. శ్రీయా గారితో కలిసి స్క్రీన్స్ షేర్ చేసుకోవడం మంచి ఎక్స్పీరియన్స్. చాలా అద్భుతమైన నటీనటులు ఈ సినిమాలో పనిచేశారు. వాళ్ళ అందరితో కలిసి నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
 
ఈ జర్నీ చాలెంజింగ్ గా అనిపించిందా?
-ఈ సినిమాలో దాదాపు 80% లైవ్ లొకేషన్స్ లో షూట్ చేశాం. ప్రతి రియల్ టైమ్ లొకేషన్స్ లోకి వెళ్లడం వెరీ చాలెంజింగ్. అయితే మా టీమ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ తో జర్నీ చాలా అద్భుతంగా జరిగింది.
 
మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు?
నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఫిదా చూసి ఫిదా అయిపోయా.తనే నా ఇన్స్పిరేషన్.
 
కొత్తగా చేస్తున్న సినిమాలు గురించి ?
వరుణ్ తేజ్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. మేకర్స్ తెలియజేస్తారు.
 
డైరెక్టర్ కార్తీక్ గారి గురించి?
కార్తీక్ గారు చాలా విజన్ ఉన్న డైరెక్టర్. ఆయన సెట్ లో చాలా క్లారిటీగా ఉంటారు. సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. మా ఇద్దరి బర్త్ డేస్ కి ఒక్క రోజు గ్యాప్. సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్ళు.
 
మీకు ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?
కథలో ప్రాధాన్యత ఉన్న అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వుండే అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే నాకు సూపర్ హీరో మూవీస్ అంటే చాలా ఇష్టం. హనుమాన్ నాకు చాలా ఇష్టమైన సినిమా. యాక్షను రొమాన్స్ నా ఫేవరెట్ జోనర్స్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం