Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భూమ్మీద మనమంతా అతిథులమే : వేణు తొట్టెంపూడి

Advertiesment
Venu Thottempudi, Avantika Mishra, Yji Bharat, Siya Gautham
, బుధవారం, 13 సెప్టెంబరు 2023 (15:32 IST)
Venu Thottempudi, Avantika Mishra, Yji Bharat, Siya Gautham
వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా లీడ్ రోల్ లో నటించిన వెబ్ సిరీస్ “అతిథి”. ఈ వెబ్ సిరీస్ ను రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు భరత్ వైజీ రూపొందించారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్ గా వ్యవహరించారు. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 19 నుంచి “అతిథి” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా హీరో వేణు తొట్టెంపూడి మాట్లాడుతూ - భూమ్మీద మనమంతా అతిథులమే. కొద్ది కాలం ఉండి వెళ్లిపోతాం. మీ ఇంట్లోకి ఈ నెల 19న అతిథులుగా రాబోతున్నాం. ప్రవీణ్ సత్తారు గారికి,  ఇంతమంచి ప్రాజెక్ట్ లో పార్ట్ చేసినందుకు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కు థ్యాంక్స్ చెబుతున్నా. స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు పనిచేసింది. ఒక సినిమా కన్నా ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగుంటాయి. డైరెక్టర్ భరత్ ప్రతి చిన్న చిన్న డీటెయిల్స్ లో కూడా జాగ్రత్తలు తీసుకున్నాడు. అందుకే అతిథి ఇంత బాగా స్క్రీన్ మీదకు వచ్చింది. అవంతిక మాయ క్యారెక్టర్ లా మారిపోయిందని చెప్పాలి. సియాతో నాకు ఎక్కువ సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ బాగా చేశాం. ఒక సినిమా రన్నింగ్ టైమ్ లో అతిథి వెబ్ సిరీస్ ఉంటుంది. స్టార్టయితే కంటిన్యూగా చూస్తారు. అంత గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఒక్క ఎపిసోడ్ మిస్సయినా ట్విస్ట్ మిస్సవుతారు. అని చెప్పారు.
 
దర్శకుడు వైజీ భరత్ మాట్లాడుతూ - ఒక చిన్న పాయింట్ తో చిన్న ప్రాజెక్ట్ గా చేయాలనుకున్నాను. అయితే క్రమంగా నేను అనుకున్నదానికంటే చాలా ఎక్కువ బడ్జెట్ వెబ్ సిరీస్ అయ్యింది. ప్రవీణ్ సత్తారు గారిని ఒక సినిమా స్క్రిప్ట్ రైటింగ్ కోసం కలిసినప్పుడు ఈ పాయింట్ చెప్పాను. ఆయనకు నచ్చి ప్రాజెక్ట్ మొదలైంది. అలాగే డిస్నీ హాట్ స్టార్ లో నా ఫ్రెండ్ సపోర్ట్ చేశాడు. అనురాధ గారికి సబ్జెక్ట్ నచ్చి వెబ్ సిరీస్ టేకప్ చేశారు. నేను అతిథి కథ చెప్పింది ఫస్ట్ వేణుగారికే. ఆయన ఒక కొత్త యాక్టర్ లా ఈ వెబ్ సిరీస్ చేశాడు.    అతిథిలో హారర్, థ్రిల్లర్ అంశాలుంటాయి. ప్రతి ఏపిసోడ్ ట్విస్టులతో సాగుతుంది. ఫ్యామిలీ అంతా చూసే వెబ్ సిరీస్ ఇది. అన్నారు.
 
హీరోయిన్ సియా గౌతమ్ మాట్లాడుతూ - భయపెడుతూ థ్రిల్ అందించే వెబ్ సిరీస్ ఇది. వేణు గారితో నాకు ఎక్కువగా సీన్స్ ఉంటాయి. అవంతిక మిశ్రా మాయ క్యారెక్టర్ లో మిమ్మల్ని భయపెడుతుంది. అతిథి ఒక్క సీజన్ తో ఆగదు చాలా సీజన్స్ గా వస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను. అని చెప్పింది.
 
హీరోయిన్ అవంతిక మిశ్రా మాట్లాడుతూ - తెలుగులో హారర్ కంటెంట్ తక్కువగా వస్తుంటుంది. ఆ లోటును అతిథి తీరుస్తుందని చెప్పగలను. వేణు గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. సియా మంచి కోస్టార్. డైరెక్టర్ వైజీ భరత్ మా దగ్గర పర్ ఫార్మెన్స్ చేయించేప్పుడు కాంప్రమైజ్ కాలేదు. హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి పర్ ఫెక్ట్ వెబ్ సిరీస్ అతిథి. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో చూడండి. అని చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"మంచి సమయం మొదలైంది".. నయనతార ఇన్‌స్టా పోస్ట్ వైరల్