Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జెన్నీ కుమారుడు రియాన్ చిన్న చిన్న పాదాలతో చిందేస్తూ.. అదరగొట్టేస్తున్నాడే..

టాలీవుడ్ ప్రేక్షకులకు జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. బొమ్మరిల్లి సినిమాలో హాసినిగా తెలుగు ప్రేక్షకుల మదిని దోచేసిన జెన్నీ.. బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్‌ను పెళ్ళాడింది. ఆపై ఇద

Advertiesment
Watch: When Riaan joined his father Riteish Deshmukh and danced on Rada song
, గురువారం, 15 సెప్టెంబరు 2016 (18:36 IST)
టాలీవుడ్ ప్రేక్షకులకు జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. బొమ్మరిల్లి సినిమాలో హాసినిగా తెలుగు ప్రేక్షకుల మదిని దోచేసిన జెన్నీ.. బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్‌ను పెళ్ళాడింది. ఆపై ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. పెద్దకొడుకైన రియాన్‌కు రెండేళ్లు కాగా.. చిన్న కుమారుడి వయస్సింకా ఏడాదే. ఈ నేపథ్యంలో రియాన్ అప్పుడే డ్యాన్స్ బాయ్‌గా మారిపోయాడు. ఎలాగంటే..? రితేష్ హీరోగా బాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న ‘బాంజో’ చిత్రం ట్రైలర్‌తో పాటు కొన్ని సాంగ్స్‌ను ఆ చిత్రం బృందం ఇటీవ‌లే విడుద‌ల చేసింది. 
 
మరోవైపు ''బాంజో'' టీమ్ ఓ పాట మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇందులో రియాన్ అదిరే స్టెప్పులేస్తూ.. జెన్నీ, రితీష్‌లను కట్టిపడేశాడు. రియాన్ డ్యాన్స్ చూస్తూ రితేష్, జెన్నీ బాగా ఎంజాయ్ చేశారు. రెండేళ్ల వ‌య‌సులోనే చిన్ని చిన్ని పాదాల‌తో చిందులేస్తుండటాన్ని చూసి జెన్నీ, రితీష్ ఆనందానికి అవధుల్లేవు.
 
ఇకపోతే.. ''బంజో'' సినిమా ద్వారా నర్గీస్, రితేష్ రెండో సారి జతకట్టారు. అంతకుముందు హౌస్ ఫుల్ 3తో తెరపై కనిపించిన ఈ జంట మళ్లీ రెండోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. బంజో సినిమాను ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తుండగా, రవి జాధేవ్ దర్శకత్వం వహించారు. 23వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో ఈవ్ టీజింగ్ కామన్.. ఎక్కడపడితే అక్కడ చేతులేస్తారు.. నేను అనుభవించా: తాప్సీ