Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''ఎళ్ళిపోమాకే' అంటున్న నాగచైతన్య.. సాహసం ఆడియో త్వరలో!

Advertiesment
''ఎళ్ళిపోమాకే' అంటున్న నాగచైతన్య.. సాహసం ఆడియో త్వరలో!
, శుక్రవారం, 6 మే 2016 (19:46 IST)
'ఏ మాయ చేసావే' సినిమాతో మ్యాజిక్‌ చేసిన హీరో నాగ చైతన్య, దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ల క్రేజీ కాంబినేషన్‌లో మరో సినిమా అనగానే ఆ సినిమాకు ఏ స్థాయి అంచనాలు ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఆ అంచనాలను రెట్టింపు చేసేలా 'సాహసం శ్వాసగా సాగిపో' అనే టైటిల్‌ పెట్టి, 'ఏ మాయ చేసావే' ఫీల్‌ను తలపించేలా టీజర్‌, పోస్టర్స్‌ రిలీజ్‌ చేసి సినిమాపై మంచి ఆసక్తి రేకెత్తించారు. షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలాఖర్లో ఆడియో రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
 
ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని 'ఎళ్ళిపోమాకే' అనే పాట సూపర్‌ హిట్‌ కాగా, నిన్న శోకిల్లా అనే మరో పాట టీజర్‌ను కూడా విడుదల చేసి సినిమాకు ఆడియో ఓ హైలైట్‌గా నిలవనుందని స్పష్టం చేసినట్లైంది. ఇక ఈవారమే ఆడియో రిలీజ్‌ చేపట్టాలని ప్లాన్‌ చేసినా, సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌ ఓ ప్రత్యేక కన్సర్ట్‌ కోసం అమెరికా వెళ్ళడంతో ఆయన వచ్చేంత వరకూ ఆడియో రిలీజ్‌ చేయట్లేదు.
 
మే నెలాఖర్లో రెహమాన్‌ రాగానే ఆడియో రిలీజ్‌ కానుంది. తెలుగులో ఈ సినిమాను నిర్మిస్తోన్న కోన వెంకట్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ వర్షన్‌కు శింబు హీరోగా నటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ధృవ' కోసం రామ్ చరణ్ ప్రత్యేక కసరత్తు: కశ్మీర్‌లో షూటింగ్ షెడ్యూల్!