ఆర్ఎక్స్ 100 హీరోయిన్‌కు ఇక రొమాన్స్‌ వద్దంటోంది..

సోమవారం, 23 డిశెంబరు 2019 (19:10 IST)
ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్ పుత్ తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అప్పటి నుంచి రొమాన్స్ ప్రధానంగా కలిగిన సినిమాల్లోనే పాయల్ కి అవకాశాలు వస్తున్నాయి.

ఆ తరహా పాత్రలే ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే రొమాన్స్‌కి కాస్త దూరం వుండే పాయల్ నటించిన వెంకీ మామ సినిమా హిట్ అయ్యింది. ఈ సినిమా విజయంతో రొమాన్స్‌ రోల్స్ వద్దనుకుంటోంది పాయల్. 
 
ఇకపై నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో కనిపించేందుకు సిద్ధమవుతుంది. పెద్దల హీరోల సరసన నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో కనిపించాలనుకుంటోంది. ప్రస్తుతం రవితేజతో పాయల్ డిస్కోరాజా సినిమా చేయనుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఇద్దరు హీరోయిన్ల సరసన రీ-ఎంట్రీ ఇవ్వనున్న పవర్ స్టార్.. కథేంటో తెలుసా?