Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Vyrl సౌత్ రెండు కొత్త చార్ట్ బస్టర్స్ ను ఆవిష్కరించింది

Kavya Kalyan Ram

డీవీ

, సోమవారం, 27 మే 2024 (14:06 IST)
Kavya Kalyan Ram
VYRL సౌత్ అనేది యూనివర్శల్ మ్యూజిక్ ఇండియా నుండి వచ్చిన ఒక ప్లాట్‌ఫాం, సౌత్ ఇండియాలో ఐపాప్ మ్యూజిక్ కల్చర్ ని పరిచయం చేసి, దానికంటూ ఒక బేస్ ఉండేలా కృషి చేస్తుంది. ఒరిజినల్ కంటెంట్ తో, అర్ధ వంతమైన మ్యూజిక్ తో, క్లట్టర్ బ్రేకింగ్ స్లిక్ వీడియోస్ తో ఐపాప్ మ్యూజిక్ కోసం ఎదురు చూసే మ్యూజిక్ లవర్స్ అందరికీ ఏకైక డేష్టినేషన్ Vyrl సౌత్. ఈ లేబుల్ తన మొదటి రెండు సింగిల్స్ విడుదలతో తెలుగు సంగీత రంగంలో సంచలనాత్మక ప్రవేశం చేసింది. రెండు పాటలు సంగీత ప్రియుల హృదయాలను గెలిచి ఇంటర్నెట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.
 
మొదటి సింగిల్, "ఓసెలియా," కి గణేష్ క్రోవ్విది, రిక్కీ బి మరియు ఫిరోజ్ ఇజ్రాయెల్ సంగీతం అందించగా, ఇటీవల టాలీవుడ్ సంచలనం కావ్య కళ్యాణ్ రామ్ నటించారు. ఈ మెలోడీ ట్రాక్ వేగంగా చార్ట్‌బస్టర్‌గా మారి, మెలోడీ సంగీత ప్రేమికులను లోతుగా ఆకట్టుకుంది.
 
webdunia
Sri Satya, Vinod Kumar
ఈ విజయాన్ని పురస్కరించుకుని, Vyrl సౌత్ తన రెండవ సింగిల్, "సిన్నదాని సూపులే"ని విడుదల చేసింది. టెలివిజన్ సెన్సేషన్ శ్రీ సత్య మరియు వినోద్ కుమార్ ఎస్ నటించిన ఈ పాట అద్భుతమైన విషువల్స్ తో వినడానికి శ్రవణానందంగా ఉంది. ఈ పాటకి యాడిక్రీజ్ సంగీతం అందించడంతో పాటు, సిన్నదాని సుపులే సాంగ్ లో కనిపించారు కాదు, వీరితో పాటు సాకేత్ కొమండురి, దాసరి మేఘన నాయుడు కూడా ఈ పాటలో పెర్ఫార్మన్స్ చేశారు. ఇప్పుడు ఈ పాట కూడా త్వరలో పెద్ద హిట్ గా మారబోతుంది.
 
ఓ సెలియా, సిన్నదాని సుపులే ఈ రెండు పాటలు Vyrl సౌత్ youtube channelలో అందుబాటులో ఉన్నాయి.  సంగీత అభిమానులు వీక్షించి వినూత్న సంగీత మాయజాలంలో మునిగి తెలోచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఇది నేనంటే నమ్మలేకపోతున్నాను'.. జానీ సినిమా వీడియో క్లిప్‌ను షేర్ చేసిన రేణూ దేశాయ్!