Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నడిగర్ సంఘం భవనం నిర్మాణం.. విశాల్ - నాజర్‌లకు హైకోర్టు నోటీసులు

తమిళనాడు నడిగర్ సంఘం భవన నిర్మాణ ఒప్పందం వ్యవహారంలో లోకనాయకుడు కమలహాసన్, నాజర్, విశాల్, ఎస్‌వీ.శేఖర్ తదితర తొమ్మిది మందికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలను పరిశీలిస్తే... చెన్నై తాంబ

నడిగర్ సంఘం భవనం నిర్మాణం.. విశాల్ - నాజర్‌లకు హైకోర్టు నోటీసులు
, గురువారం, 15 సెప్టెంబరు 2016 (13:04 IST)
తమిళనాడు నడిగర్ సంఘం భవన నిర్మాణ ఒప్పందం వ్యవహారంలో లోకనాయకుడు కమలహాసన్, నాజర్, విశాల్, ఎస్‌వీ.శేఖర్ తదితర తొమ్మిది మందికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలను పరిశీలిస్తే... చెన్నై తాంబరానికి చెందిన వారాహి అనే నడిగర్‌ సంఘం సభ్యుడు మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. 
 
భవన నిర్మాణ నిర్ణయం ఏకపక్షమని, తమతో చర్చించకుండానే, బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. కాబట్టి ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని సంఘ సభ్యులందరితో చర్చించి కొత్త ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. 
 
వారాహి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్ , కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, సంఘ ట్రస్ట్ సభ్యులు కమలహాసన్, కుట్టిపద్మిని, ఎస్‌వీ.శేఖర్, పూచిమురుగన్ మొదలగు తొమ్మిది మందికి నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''పర్చేద్'' లీక్.. అజయ్ దేవ్‌గన్‌పై రాధికా ఆప్టే ఫైర్.. మాటతప్పారంటూ చిందులు..