Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మామకు యముడు వరమ్మకు మొగుడు.. రాధికను పక్కనబెట్టిన వరలక్ష్మి.. ఎందుకో తెలుసా?

మొన్నటికి మొన్న జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్- విశాల్‌ల మధ్య ఎలాంటి గొడవలు జరిగాయో అందరికీ తెలిసిందే. శరత్ కుమార్- విశాల్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే శరత్ కుమార్ కుమార్తె వ

మామకు యముడు వరమ్మకు మొగుడు.. రాధికను పక్కనబెట్టిన వరలక్ష్మి.. ఎందుకో తెలుసా?
, మంగళవారం, 30 ఆగస్టు 2016 (17:05 IST)
మొన్నటికి మొన్న జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్- విశాల్‌ల మధ్య ఎలాంటి గొడవలు జరిగాయో అందరికీ తెలిసిందే. శరత్ కుమార్- విశాల్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో మాత్రం విశాల్ ప్రేమాయణం ఎంచక్కా సాగిపోతోంది. దీంతో హీరో విశాల్ ప్రేమాయణం సినీ ఇండస్ట్రీలో వెరైటీగా నిలిచిపోతోంది. 
 
పాతకాలం లవ్ స్టోరీలా మామకు యముడు.. ఆయన కుమార్తె మొగుడుగా విశాల్ వ్యవహరిస్తున్నాడు. ఇందులో భాగంగానే వరలక్ష్మిని విశాల్ బుట్టలో వేసుకున్నాడు. శరత్ కుమార్‌పై విమర్శలు చేసేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గని విశాల్.. ఇటీవల ట్విట్టర్లో వరలక్ష్మితో తీసుకున్న ఫోటో పోస్ట్ చేశాడు. అయితే వరలక్ష్మి ప్రేమ దోమా ఏదీ లేదని మీడియాతో చెప్పింది. కానీ విశాల్ పుట్టిన రోజు వచ్చేసరికి మాట మార్చేసింది.
 
ఆగస్టు 29 (సోమవారం) విశాల్ తన పుట్టిన రోజును వరలక్ష్మితోనే జరుపుకున్నాడు. అంతేగాకుండా విశాల్‌ పుట్టిన రోజునాడు ‘నా ప్రేమకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ రోజే ఓ ఆస్పత్రిలో జరిగిన విశాల్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు హాజరై హంగామా చేసింది. కొత్తగా జన్మించిన 20 మంది చిన్నారులకు బంగారు ఉంగరాలు బహుమతులుగా ఇచ్చి పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకుంది విశాల్- వరలక్ష్మి జంట. 
 
ఇదంతా చూశాక కోలీవుడ్ జనమంతా త్వరలోనే ఈ జంట పెళ్ళి పీటలు ఎక్కడం ఖాయమనుకుంటున్నారు. మరి పెళ్లన్నాక.. మామగారి సమ్మతం కావాలిగా అంటున్నారు సినీ జనం. మరి విశాల్ మామ అంగీకారంతో వరలక్ష్మిని పెళ్ళి చేసుకుంటాడో లేకుంటే శరత్ కుమార్ అంగీకరించకుండానే వరలక్ష్మి మెడలో తాళికడతాడో తేలాలి. 
 
మరోవైపు శరత్ కుమార్ రెండోసారి వివాహం చేసుకున్న నటీమణి రాధికా రెండో భర్త రిచర్డ్ హార్డ్‌కు జన్మించిన రేయాన్ రాధికకు కర్ణాటకు చెందిన క్రికెటర్ అభిమన్యు మిథున్‌కు ఇటీవల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలో సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు పాల్గొన్నారు. అయితే ఈ వివాహానికి శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి మాత్రం హాజరు కాలేదు. 
 
వరలక్ష్మి ప్రేమికుడు విశాల్‌కు నడిగర్ సంఘం వ్యవహారంలో రాధికా వ్యతిరేకంగా వ్యవహరించడంతో రాధికా కుమార్తె పెళ్ళికి వరలక్ష్మి హాజరు కాలేదని కోలీవుడ్‌ వర్గాల్లో టాక్. ఇంకేముంది.. రాధికా శరత్ కుమార్ దంపతులకు వరలక్ష్మి- విశాల్‌తో తలనొప్పి తప్పట్లేదని, వారిద్దరికీ వివాహం చేస్తేనే రాధిక- శరత్ కుమార్‌లకు ప్రశాంతత లభిస్తుందని సినీ పెద్దలు అంటున్నారు. మరి సినిమాల్లో, సీరియల్‌ల్లో బోల్డ్‌గా వ్యవహరించే రాధిక వరలక్ష్మి విషయాన్ని ఎలా డీల్ చేస్తుందో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"త్రివిక్రమన్" ప్రచార చిత్రం విడుదల...