Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"త్రివిక్రమన్" ప్రచార చిత్రం విడుదల...

, మంగళవారం, 30 ఆగస్టు 2016 (16:55 IST)
"త్రివిక్రమపాండ్యన్" అనే రాజు మరణానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవడానికి వెళ్లిన ఒక బృందం ఎదుర్కొన్న పరిస్థితులు, పరిణామాల సమాహారంగా రూపొందిన చిత్రం "త్రివిక్రమన్". అమీ ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో క్రాంతికుమార్ నిర్మించిన ఈ చిత్రానికి తోటకూర రామకృష్ణారావు సహ నిర్మాత. కస్తూరి శ్రీనివాస్ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. లేడి మ్యూజిక్ డైరెక్టర్ రుంకీ గోస్వామి సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బోలె రీ రికార్డింగ్ అందించారు. 
 
డిస్కోశాంతి సోదరి సుచిత్ర ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. రవిబాబు, నాగబాబు, "ఈరోజుల్లో" ఫేమ్ శ్రీధన్‌రాజ్,  ప్రవీణ్ రెడ్డి, అమూల్యారెడ్డి, షాలిని ముఖ్య తారాగణంగా.  సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణరాజు "త్రివిక్రమన్" ట్రైలర్ రిలీజ్ చేశారు. విశిష్ట అతిధిగా హాజరైన శేకూరి ధర్మశాస్త్ర పీఠాధిపతి గుంతుపల్లి శ్రీనివాసరావు"త్రివిక్రమన్" టైటిల్ లోగోను ఆవిష్కరించారు. 
 
తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చినబాబు, విశ్వ తదితరులతోపాటు "త్రివిక్రమన్" యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. వినూత్నమైన కథ - కథనాలతో  సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందిన "త్రివిక్రమన్" టైటిల్ లోగో, ట్రైలర్ చాలా బాగున్నాయని, సినిమా ఘన విజయం సాధించి, దర్శకనిర్మాత క్రాంతికుమార్ ఉజ్వలమైన భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని వక్తలు ఆకాంక్షించారు. 
 
ఈ చిత్రంలో ఓ మంచి పాత్ర పోషించిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ చిత్రం వీలైనన్ని ఎక్కువ థియేటర్స్‌లో విడుదలయ్యేందుకు తన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. దర్శకనిర్మాత క్రాంతికుమార్ మాట్లాడుతూ "సహ నిర్మాత తోటకూర రామకృష్ణారావు, తన మిత్రుడు ప్రవీణ్ రెడ్డి, ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేసిన కస్తూరి శ్రీనివాస్‌ల సహాయ సహకారాల వల్లే.. సినిమా తీయాలనే తన కల సాకారమైందని, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కనుమూరి రఘురామకృష్ణంరాజు, చినబాబుల ప్రోత్సాహాన్ని తానెప్పటికీ మర్చిపోలేనని" అన్నారు. 
 
కొత్తదనానికి పట్టం కట్టే తెలుగు ప్రేక్షకులు "త్రివిక్రమన్" చిత్రానికి తప్పకుండా మంచి విజయం అందిస్తారనే నమ్మకం తనకుందన్నారు. చిత్ర నిర్మాణంలో తనకు సహాయ సహకారాలు అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా యూనిట్ సభ్యులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. డిస్కో సుచిత్ర, సన, సహదేశ్ పాండే, చంటి, సత్తెన్న తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కథ: చెరుకు బత్తుల, రచనా సహకారం: టి.హర్షవర్ధన్, సినిమాటోగ్రఫీ: నాగార్జున-సునీల్-బాబు, ఎడిటింగ్: సునీల్ మహారాణా, రీ రికార్డింగ్: బోలె, సంగీతం: రుంకీ గోస్వామి, కో-ప్రొడ్యూసర్: తోటకూర రామకృష్ణారావు, దర్శకత్వ పర్యవేక్షణ: కస్తూరి శ్రీనివాస్, నిర్మాణం-దర్శకత్వం: క్రాంతికుమార్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మలయాళ రీమేక్‌లో అల్లరి నరేష్... 'అలా ఎలా' ఫేం దర్శకత్వంలో