Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మలయాళ రీమేక్‌లో అల్లరి నరేష్... 'అలా ఎలా' ఫేం దర్శకత్వంలో

తమిళ చిత్రం రీమేక్‌గా తెలుగులో రూపొందిన 'సుడిగాడు' చిత్రంతో కెరీర్ బెస్ట్ కమర్షియల్ హిట్‌ను సాధించిన వినోదాత్మక చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ మరోసారి ఓ సెన్సేషనల్ రీమేక్‌లో నటించబోతున్నాడు.

మలయాళ రీమేక్‌లో అల్లరి నరేష్... 'అలా ఎలా' ఫేం దర్శకత్వంలో
, మంగళవారం, 30 ఆగస్టు 2016 (16:47 IST)
తమిళ చిత్రం రీమేక్‌గా తెలుగులో రూపొందిన 'సుడిగాడు' చిత్రంతో కెరీర్ బెస్ట్ కమర్షియల్ హిట్‌ను సాధించిన వినోదాత్మక చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ మరోసారి ఓ సెన్సేషనల్ రీమేక్‌లో నటించబోతున్నాడు. మలయాళంలో రూపొంది ఘనవిజయం సాధించిన "ఒరు వడక్కన్ సెల్ఫీ" చిత్రంలో నరేష్ కథానాయకుడిగా నటించబోతున్నాడు. 
 
కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మలయాళ చిత్ర రీమేక్ హక్కులను ఫ్యాన్సీ రేట్‌తో సొంతం చేసుకున్నారు జాహ్నవి ఫిలింస్ అధినేత బొప్పన చంద్రశేఖర్. అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించనున్న ఈ తెలుగు రీమేక్‌కు 'అలా ఎలా' చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న అనీష్ కృష్ణ దర్శకుడు. అక్టోబరులో చిత్రీకరణ ప్రారంభంకానున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత బొప్పన చంద్రశేఖర్ వెల్లడించారు. 
 
మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం హక్కులను సొంతం చేసుకోవడం ఆనందంగా వుంది. ఇది నరేష్ కెరీర్‌లో వైవిధ్యమైన కమర్షియల్ చిత్రంగా నిలిచిపోతుంది. ఎంటర్‌టైన్‌మెంట్, హ్యుమన్ ఎమోషన్స్‌తో పాటు నేటి యువతరం నచ్చే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. గమ్యం తర్వాత నరేష్ నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ చిత్రమిది. 
 
మలయాళంలో ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: డి.జె.వసంత్, సమర్పణ: శ్రీమతి నీలిమ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక క్రీడలు చాలు.. సినిమాలపై దృష్టిసారించిన సైనా నెహ్వాల్.. దీపికతో డిన్నర్...