Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిర్మాతల మండలి ఎన్నికలు.. బరిలోకి ఖుష్భూ.. విశాల్ సంచలన ప్రకటన

రాజకీయాలను తలపించేలా సాగిన నడిగర్ సంఘం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌లో మరో సంగ్రామానికి తెరలేవబోతోంది. ఈసారి తమిళ సినిమా నిర్మాతల వంతు వచ్చింది. తమిళ సినీ నిర్మాతల మండలి నూతన

Advertiesment
Vishal announces Khushbu’s name for Producers Council polls
, సోమవారం, 2 జనవరి 2017 (08:45 IST)
రాజకీయాలను తలపించేలా సాగిన నడిగర్ సంఘం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌లో మరో సంగ్రామానికి తెరలేవబోతోంది. ఈసారి తమిళ సినిమా నిర్మాతల వంతు వచ్చింది. తమిళ సినీ నిర్మాతల మండలి నూతన కార్యవర్గ ఎంపికకు వచ్చే ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి.

సీనియర్‌ నిర్మాత కలైపులి ఎస్‌.థాను నేతృత్వంలోని ప్రస్తుతం కార్యవర్గంపై అసంతృప్తితో ఈ ఎన్నికల్లో పలు కూటములు బరిలోకి దిగే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నడిగర్‌ సంఘం ఎన్నికల్లో సంచలనం సృష్టించిన నటుడు విశాల్‌ నిర్మాతల మండలి ఎన్నికల్లోను బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ వార్తలను నిజం చేసేలా నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ తన కూటమి తరపున సీనియర్‌ నటి, నిర్మాత ఖుష్బూ అధ్యక్ష పదవికి పోటీచేయనున్నట్టు ప్రకటించి మరో సంచలనానికి తెరదీశారు. ఈ మేరకు విశాల్‌ ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇతర పదవులకు పోటీచేయనున్న అభ్యర్థుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మక భావించాలని విశాల్ ప్రకటించారు. 2015లో బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత అధ్యక్షుడు థాను నేతృత్వంలోని కార్యవర్గం కాలపరిమితి త్వరలో ముగియనుంది. దీంతో నూతన కార్యవర్గం ఎంపికకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని నిర్ణయించారు.
 
ఈ ఎన్నికల్లో బరిలో దిగేందుకు విశాల్‌ కూటమి రంగం సిద్ధం చేస్తోంది. కూటమి సభ్యులతో చర్చించిన తరువాత నటి ఖుష్బూ సుందర్‌ను తమ కూటమి అధ్యక్ష పదవి అభ్యర్థిగా నిర్ణయించామని విశాల్‌ ప్రకటనలో తెలిపారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త సంవత్సర శుభాకాంక్షలు.. ఖైదీనంబ‌ర్ 150తో వస్తున్నా: చిరంజీవి