Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాక్షన్ మూవీ గురించి హీరో విశాల్ రియాక్ష‌న్ ఏంటి..?

webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (21:11 IST)
”యాక్షన్‌’ నా కెరీర్‌ లో 27వ సినిమా. 27 సినిమాల్లో ఎన్ని దెబ్బలు తగలాలో ఈ సినిమాలో అన్ని దెబ్బలు తగిలాయి. సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకూ ‘యాక్షన్‌’ తప్ప మరే టైటిల్‌ అనిపించలేదు. సుందర్‌.సి గారి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. మీరు సినిమా చూస్తున్నపుడు ఇది 150 కోట్ల బడ్జెట్‌ మూవీలా కనిపిస్తుంది. కానీ 60 కోట్ల బడ్జెట్‌. 88 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశాం అని హీరో విశాల్ తెలియ‌చేసారు.
 
ఈ సినిమా గురించి విశాల్ స్పందిస్తూ.... డైరెక్టర్‌ సుందర్‌.సి గారు ఎప్పుడూ నిర్మాతలు బాగుండాలని సినిమా తీస్తారు. చాలా మంది హీరోలు మూడు రాష్ట్రాల్లో గుర్తింపు రావాలని కోరుకుంటారు కానీ.. కొంత మందికే అది వస్తుంది. అలా మీ అభిమానంతోనే ఇంత వరకు రాగలిగాను. నాకు గుడి అంటే థియేటర్‌, దేవుళ్ళు మీరే. ఈ సినిమా నాకెరీర్‌లో ఒక మైల్‌ స్టోన్‌ మూవీ అవ్వాలని సుందర్‌ గారు తీశారు. దానికి తగ్గట్టుగానే ‘యాక్షన్‌’ మూవీ ఒక విజువల్‌ ట్రీట్‌గా ఉంటుంది. నేను లక్ష్మికళ థియేటర్‌లో నేల టికెట్‌ కొనుక్కొని సినిమా చూస్తాను. అది మీకు తెలీదు. 
 
అలా చూస్తున్నప్పుడు ఏ సీన్‌కి ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారో, ఏ సీన్‌ ఇంకా బాగాఉండాలని కోరుకుంటున్నారో నాకు తెలిసేది. అలా కొంత హోమ్‌ వర్క్‌ చేసి ఈ సినిమా తీశాం. ట్రైలర్‌లో మీరు చూసిన ఆ బైక్‌ సీన్‌ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు అది నా మీదకు వచ్చింది. అయితే ఆ దేవుడి దయ, నాన్న గారి జీన్స్‌ ఫిటినెస్‌ నన్ను కాపాడాయి. ‘నువ్వు హైదరాబాద్‌కి వెళ్ళేటప్పుడు ఇది నీ సినిమా అనే గుర్తింపును నువ్వు ఎంజాయ్‌ చేయాలి ఇది నా కల. ఇది తండ్రిగా, నటుడిగా నేను నీకు ఇచ్చిన గిఫ్ట్‌’ అని నాన్నగారు చెప్తుండేవారు. అలాగే తమన్నా గారితో నా సెకండ్‌ మూవీ. అలాగే ఐశ్వర్య, ఆకాంక్ష ఇద్దరూచాలా బాగా చేశారు.
 
అలాగే ఈ సినిమాలో నా బెస్ట్‌ ఫ్రెండ్‌ రానా ఒక ర్యాప్‌ చేశారు. త్వరలోనే మీరు వింటారు. ఈ సినిమా నవంబర్‌ 15న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ అవుతుంది. శ్రీనుకి ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నా తమ్ముళ్లు చాలా మంది ఉన్నారు తెలుగు సినిమాల్లో.. వారితో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి. శ్రీను మంచి విజన్‌ ఉన్న ప్రొడ్యూసర్‌. సినిమా తీయాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు దానికి తగ్గ ఫ్యాషన్‌ ఉండాలి. అలా ఉంటేనే మనం ఖర్చుపెట్టే డబ్బు కరెక్ట్‌గా అందుతుంది.
 
మంచి సినిమా దొరుకుతుంది. లాంటి ఫ్యాషన్‌ ఉన్న ప్రొడ్యూసర్‌ శ్రీను. తెలుగులో అభిమన్యుడు కంటే ఎక్కువ షేర్‌ సాధిస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను సినిమా చూశాను. అంత బాగా వచ్చింది. అలాగే శ్రీను నా ఫ్యామిలీలో ఒక పార్ట్‌ అయ్యాడు. అలాగే తెలుగు మీడియా గురించి మేము చెన్నెలో చాలా గర్వంగా మాట్లాడుకుంటాము. ఏ సినిమా అయినా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి మీడియా తమవంతు సాయం చేస్తుంది. అలాంటి తెలుగు మీడియాకు నా కృతజ్ఞతలు. ఇక్కడ మేము చెప్పిన ప్రతి విషయం రేపు నవంబర్‌ 15న స్క్రీన్‌ మీద డబుల్‌గా కనిపిస్తుంది” అన్నారు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

భీష్మ టీజ‌ర్ రిలీజైంది, టాక్ ఏంటి?