Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభాస్‌కు విలన్లు ఇద్దరు: బాహుబలి 2కి తర్వాత సుజిత్ సినిమాలో విలన్ల డబుల్ యాక్షన్!

ప్రభాస్‌ త్వరలో నూతన చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. సుజిత్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రత్య

Advertiesment
villains double action in prabhas new film
, సోమవారం, 21 నవంబరు 2016 (14:32 IST)
ప్రభాస్‌ త్వరలో నూతన చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. సుజిత్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మించడానికి  ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రత్యేక విశేషం తాజాగా వెల్లడైంది. ఇందులో విలన్‌ పాత్రధారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఈ పాత్రకు బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ను ఎంచుకున్నారు. 
 
ఇందులో ఆయన కవలలుగా నటిస్తాడని, వాటిలో ఒక పాత్ర విలన్‌ అయితే, మరో పాత్ర హీరోకి స్నేహితుడుగా కనిపించే పాజిటివ్‌ పాత్ర అని సమాచారం. ఈ రెండు పాత్రలు ఒకేలా ఉండడంతో పలుసార్లు హీరో కన్‌ఫ్యూజ్‌ అవుతాడట. 
 
ఈ సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్‌ టైన్‌ చేస్తాయని అంటున్నారు. జనవరి నుంచి మొదలయ్యే ఈ చిత్రం కోసం నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ఇప్పటికే డేట్స్‌ కూడా కేటాయించినట్టు తెలుస్తోంది. భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్ళి ఎక్కడ జరిగినా.. రిసెప్షన్‌ మాత్రం ఇక్కడే.. సమంత క్లారిటీ