Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కిచ్చా సుదీప్ సిల్వ‌ర్ జూబ్లీ చిత్రంగా విక్రాంత్ రోణ త్రీడీ

Advertiesment
Kicha Sudeep
, శనివారం, 2 ఏప్రియల్ 2022 (18:15 IST)
Vikrant Rona 3D
శాండిల్‌వుడ్‌ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ త్రీడీ మూవీ `విక్రాంత్ రోణ‌`. ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మించిన ‘విక్రాంత్ రోణ‌’ చిత్రాన్ని అనుప్‌ భండారి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని జూలై 28న విడుద‌ల చేస్తున్నారు. ఉగాది పండుగ సంద‌ర్భంగా ఈ సినిమా రిలీజ్ టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి  రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు.  
 
ఈ చిత్రంతో విక్రాంత్ రోణ అనే కొత్త సూప‌ర్ హీరో ప‌రిచ‌యమ‌వుతున్నాడు. సినీ ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా సిల్వ‌ర్ జూబ్లీ పూర్తి చేసుకున్న సుదీప్ న‌టిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రీసెంట్‌గా కిచ్చా సుదీప్ సినీ జ‌ర్నీకి సంబంధించిన స్నీక్ పీక్‌ను  ప్రపంచంలోనే ఎత్తైన భవనం, దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాలో విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ సహా నిరూప్ భండారి, నీతా అశోక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘నిర్మాతగా, విక్రాంత్ రోణ చిత్రాన్నిజూలై 28న విడుద‌ల చేస్తామ‌ని తెలియ‌జేయ‌డానికి సంతోషంగా ఉంది. ప్రపంచంలోని కొత్త హీరో విక్రాంత్ రోణ‌ను ప్రేక్షకులకు వారి ప్రాధాన్యత భాషలో అందించడానికి మేము ప్రయత్నిస్తాం. విజువల్ వండర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం కిచ్చా సుదీప్ స్టార్ ప‌వ‌ర్‌తో  ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్‌కు భారీగా ర‌ప్పిస్తుంద‌ని మేం న‌మ్మ‌కంగా, ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నాం’’ అన్నారు.
 
జాన్‌ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మించిన 'విక్రాంత్ రోణ‌' చిత్రానికి అలంకార్‌ పాండియన్‌ సహ నిర్మాత. బి.అజనీష్‌ లోక్‌నాథ్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి విలియమ్‌ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు. శివకుమార్‌.జె ప్రొడక్షన్‌ డిజైననర్‌గా వ్యవహరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క‌ళ్యాణ్ రామ్ బింబిసార గ్రాండ్ రిలీజ్