Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వర్కౌట్స్ చేస్తున్న పెళ్లి కుమారుడు.. విక్రమ్ సినిమా భారీగా డిమాండ్ చేస్తుందట..

త్వరలో పెళ్లి కుమారుడు కాబోతున్న అఖిల్.. ఓ వైపు తన పెళ్లి పనులు చూస్తూనే మరోవైపు సినిమాలు పనులు కానిచ్చేస్తున్నాడు. విక్రమ్‌ సినిమా తన నుంచి చాలా డిమాండ్‌ చేస్తోందని అక్కినేని అఖిల్ చెప్పుకొచ్చాడు. 'అ

Advertiesment
వర్కౌట్స్ చేస్తున్న పెళ్లి కుమారుడు.. విక్రమ్ సినిమా భారీగా డిమాండ్ చేస్తుందట..
, శనివారం, 7 జనవరి 2017 (11:42 IST)
త్వరలో పెళ్లి కుమారుడు కాబోతున్న అఖిల్.. ఓ వైపు తన పెళ్లి పనులు చూస్తూనే మరోవైపు సినిమాలు పనులు కానిచ్చేస్తున్నాడు. విక్రమ్‌ సినిమా తన నుంచి చాలా డిమాండ్‌ చేస్తోందని అక్కినేని అఖిల్ చెప్పుకొచ్చాడు. 'అఖిల్‌' రెండో సినిమా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో మాస్ హీరోగా అఖిల్ కనిపిస్తాడు. 
 
ఈ సినిమాలోని తన పాత్ర కోసం కసరత్తులు ప్రారంభించినట్లు అఖిల్ ట్వీట్ చేశారు. ఈ సినిమా కోసం కొత్త వ్యాయామ షెడ్యూల్‌, డైట్‌, వర్కౌట్స్ ఫాలోఅవుతున్నట్లు అఖిల్ పేర్కొన్నారు. తర్వాతి సినిమా కోసం ఫిట్‌ అవ్వాల్సిన సమయమని పేర్కొన్నారు. ఈ చిత్రంలో తమిళ నటి మేఘ ఆకాష్‌ను కథానాయికగా అనుకుంటున్నట్లు సమాచారం. 
 
విక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన '24' చిత్రం ఇటీవల విడుదలైంది. సూర్య, సమంత, నిత్యామేనన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం అఖిల్ సినిమా కూడా మంచి హిట్ టాక్‌ను తన ఖాతాలో వేసుకోనున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భార్య సురేఖ చాలా కర్కశంగా వ్యవహరించింది : చిరంజీవి