Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'24'కు సీక్వెల్‌ వుంది.. మహేష్, అల్లు అర్జున్‌తో వరుస సినిమాలు!: విక్రమ్ కుమార్

Advertiesment
Vikram Kumar Confirms His Next Projects With Allu Arjun & Mahesh Babu
, బుధవారం, 11 మే 2016 (17:44 IST)
తమిళంలో '13బి' సినిమాతో వెలుగులోకి వచ్చిన దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌. తెలుగులో నితిన్‌ ఇచ్చిన అవకాశం 'ఇష్క్‌'తో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత నాగార్జున 'మనం'తో మరింత ప్రాముఖ్యం సంపాదించాడు. ఈసారి ఏకంగా తమిళ స్టార్‌ సూర్యతో '24' అనే సినిమా తీసి మెప్పించాడు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన ఆయనతో ఇంటర్వ్యూ. 
 
'24' టైటిల్‌ పెట్టడానికి కారణం? 
టైం గురించి చెబుతున్నాం కాబట్టి .. రోజుకు 24 గంటలు కనుక టైటిల్‌ పెట్టాం. 24 అవర్స్‌లోనే వుపయోగపడే వాచ్‌ కనుక 24 అనే పెట్టాల్సివచ్చింది. 
 
24 అవర్స్‌లోనే వెనక్కు వెళ్ళేవాచ్‌ కోసం ఆత్రేయ క్యారెక్టర్‌ ఎందుకు? తమ్ముడ్ని చంపుతుంది? అసలేం అర్థంకాదు? 
కరెక్టే.. 24 అవర్స్‌లో టైం వెనక్కువెళ్ళి.. ఏదైనా చేయవచ్చనేది కాన్సెప్ట్‌. కానీ ఆ విషయం ఆత్రేయకు తెలీదు. తను 26 ఏళ్ళ గతాన్ని కోల్పోయి కోమాలోంచి బయటకు వచ్చాక ఆకారాన్ని చూసుకుని బాధపడతాడు. అదికాకుండా.. సోదరుడైన డా.శివకుమార్‌ను ఎందుకు చంపాలనుకున్నాడనేది.. సీక్వెల్‌లో ప్లాన్‌ చేశాం. అది కూడా త్వరలో తయారువుతుంది. 
 
మీ సినిమాలో ఎక్కడా లాజిక్కులకు అందవు.. కామన్‌మాన్‌ ఎలా అర్థం చేసుకుంటాడు? 
టైం మిషన్‌ గురించి చెప్పేటప్పుడు లాజిక్కులు వెతక్కూడదు. అది ఊహ మాత్రమే. అలా ఉంటే ఏమిటనేది కథ. ఒక కుర్రాడు పరీక్షరాసి ఆ టైంలో తోచింది రాసి ఇచ్చేస్తాడు. కానీ బయటకు వచ్చాక.. అరే! ఇలా రాస్తే బాగుండేది.. తప్పుజరిగిందని.. భావించి.. ఒక్కసారి వెనక్కువెళి.. పేపర్‌ను బాగా రాస్తే.. అనే ఆలోచిస్తాడు. కానీ అది జరగని విషయం. అదే జరిగితే ఎలా వుంటుందనేది.. 24 కథ. ఇందులో లాజిక్కులు గురించి ఆలోచిస్తే.. కథ నడవదు. 
 
24 సినిమాకు రెస్పాన్స్‌ ఎలా వుంది? 
ట్రెమండస్‌ రెన్సాన్స్‌. సూర్య చేసిన ఆత్రేయ పాత్రకు కనెక్ట్‌ అవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు ఈ సినిమా చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇండస్ట్రీలోనే చాలామంది మెచ్చుకున్నారు. 
 
24 కథను సూర్యకు ముందు ప్రముఖ హీరోలకు చెప్పారు కదా.. వివరాలు చెబుతారా? 
అవన్నీ ఇప్పుడు వద్దు.. టైం జరిగిపోయింది.. వెనక్కు వద్దు (అంటూ నవ్వుతూ)... ఏదైనా.. సూర్య చేతికి రావడం టైం సెట్‌ అయిందనుకుంటున్నాను. 
 
మీ సినిమాలన్నీ టైం మీద నడుస్తాయి? మనంలో వాల్‌క్లాక్‌.. ఇందులో చేతి గడియారం.. రీజన్‌ ఏమిటి? 
ప్రతి మనిషి టైంలోనే ప్రయాణిస్తాడు. ప్రతిదీ టైంలో జరిగిపోయాలి. రోజూ వారీ పనులన్నీ టైంలోనే చూసుకుంటాం. బిజీ లైఫ్‌లో టైమ్‌ గురించి పట్టించుకోం కానీ.. ఒక్కసారి ఆలోచిస్తే.. అన్నీ టైంతో ముడిపడివ ఉంటాయి. అయితే నా తర్వాత చిత్రాల్లో ఈసారి అలా వుండదు. 
 
'ఆదిత్య 369' చూశారా? 
చూడలేదు. ఇటీవలే ఆ నిర్మాత కుమార్తె ఓసారి కలిసి.. సినిమా గురించి మాట్లాడారు. ఆ దర్శకడు, నిర్మాతను కలిసి ఒక్కసారి హగ్‌ చేసుకోవాలనిపించింది. ఇంకా ఆ సినిమా చూడలేదు. త్వరలో చూస్తాను. అప్పట్లోనే టైం బేస్డ్‌ మూవీ తెలుగులో రావడం గొప్ప 
విశేషం. 
 
'మనం' రీమేక్‌ కోసం సూర్య దగ్గరకు వెళ్ళి. 24 తీశారు కారణం? 
ముందుగా మనం కథను చెబుతానని పర్మిషన్‌ తీసుకున్నాను. మనంలో వేసిన మూడు పాత్రల్లోనూ సూర్య, ఆయన తండ్రిగారు, కార్తీ, జ్యోతిక.. కలిసి నటించేలా ప్లాన్‌ చేశాం. కానీ దానికంటే ఇంకో కథుంది.. వింటారా? కొత్తగా వుంటుందని 24 కథ చెప్పాను. ఇందులో మూడు పాత్రలని ముందుగా చెప్పలేదు. ఆత్రేయ పాత్ర గురించి నెగెటివ్‌ షేడ్స్‌ గురించి చెప్పిన తర్వాత.. ఇది నేను చేస్తానన్నారు. అలా 
వరుసగా మూడు చేయాల్సివచ్చింది. 
 
'మనం' రీమేక్‌ చేస్తారా? 
ఒక్కసారి చేసిన సినిమాను మరలా చేయాలంటే.. బోర్‌ కొడుతుంది. ఏదైనా కొత్త కాన్సెప్ట్‌తో ముందుకుపోవాలన్నదే నా పాలసీ. 
 
మనం బాలీవుడ్‌లో అడిగినట్లు వార్తలు వచ్చాయి? 
అవును. సల్మాన్‌ఖాన్‌ అడిగాడు. నేను ఆయన ఫ్యాన్‌నుకూడా. అన్నీ కుదిరిదే వేరే వెరైనా చేస్తారేమో చూడాలి. 
 
మీ సినిమాల్లో లవ్‌ క్యూట్‌గా వుంటుంది. కారణం? 
లవ్‌ అనేది స్వీట్‌ లాంటిది. దాన్ని నిదానంగా తింటేనే ఆనందం. ప్రేమ కూడా చాలా క్యూట్‌గా.. స్వీట్‌గా వుండాలి. 13బి, ఇష్క్‌, మనం. 24లోనూ లవ్‌ ట్రాక్‌ స్వీట్‌గా వుంటుంది. అది బేలన్స్‌ తప్పకూడదు. 
 
24లో స్వీట్‌ మోతాదు పెరిగిందే? 
నవ్వుతూ... అవును.. సూర్య, సమంత.. ఇంట్లో లవ్‌సీన్లు.. కొంచెం లెంగ్త్‌ ఎక్కువయింది. దాన్ని కుదించాం. 
 
24 సినిమాకు ఆంగ్ల సినిమా ప్రేరణా? 
నేను హాలీవుడ్‌ సినిమాలు ఎక్కువగా చూస్తాను. అందులో నాకు బాగా నచ్చింది బ్యాక్‌టు ది ఫ్యూచర్‌.. అయితే.. అది మన కథకు ఎలా చెప్పవచ్చో అనేది తీసిన సినిమాలాంటిది. అంతా కాపీ మాత్రం కాదు. 
 
మీ నేపథ్యం? 
పుట్టింది పెరిగింది కేరళ. చదివింది. కొడుకెనాల్‌. ప్రస్తుతం వుంటుంది చెన్నైలో. 
 
తెలుగు బాగా మాట్లాడుతున్నారే? 
తెలుగు బాగా మాట్లాడగలను. నా అసిస్టెంట్‌ కేరళవారైనా.. తెలుగు వచ్చు. మనం కథను అక్కినేనిగారికి చెప్పేటప్పుడు పూర్తిగా తెలుగులో చెప్పాను. నా అసిస్టెంట్‌.. మలయాళంలో ఏదో చెబితే.. నేను బదులు చెప్పాను. ఏమిటీ! మీకు మలయాళం కూడా తెలుసా! అని అడిగారు.. నేను బేకిస్‌ మలయాళీనే అని చెప్పగానే.. ఆయన ఆశ్చర్యపోయారు.. అచ్చమైన తెలుగువాడిలా వున్నారే! అని అన్నారు. 
 
సమంత, నిత్య పెర్‌ఫార్మెన్స్‌ గురించి? 
ఇద్దరూ గొప్ప నటులు. వారి పాత్రలకు న్యాయం చేశారు. 
 
సూర్యకు ఆత్రేయ పాత్ర చెప్పినప్పుడు ఎలా స్పందించారు? 
ఆత్రేయ పాత్ర నెగెటివ్‌ షేడ్స్‌.. ఆ గెటప్‌.. స్టైల్‌.. గురించి చెప్పగానే ఆయన ముఖంలో కదలికలు మారిపోయాయి. చాలా ఎగ్జైట్‌ ఫీల్‌ అయ్యారు. సినిమా చేయడానికి ఆ పాత్రే కారణం. 
 
ఈ గెటప్‌కు ప్రేరణ ఎవరు? 
అందరికీ తెలిసిన.. స్టీఫెన్‌ హాక్సిన్‌‌ను స్పూర్తిగా తీసుకుని మలిచాను. వీల్‌చైర్‌లో అతని జీవితం.. అయినా తను ధైర్యంతో జీవితాన్ని సాగిస్తున్నాడు. 
 
కొత్త సినిమాలు? 
అల్లు అర్జున్‌, మహేష్‌బాబుతో సినిమాలు చేస్తున్నాను. త్వరలో ఆ వివరాలు తెలియజేస్తాను.. అని ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింధు క్రియేషన్స్ "'సింధూర'' చిత్రం ప్రారంభం