ఉప్పెనలో విజయ్ సేతుపతి లుక్ అదుర్స్

బుధవారం, 1 ఏప్రియల్ 2020 (13:06 IST)
Vijay sethupathi
మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన ఉప్పెన సినిమా నుంచి కొత్త లుక్ విడుదలైంది. బుచ్చి బాబు సనా తెరకెక్కించిన ఉప్పెన  సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది.

కానీ ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే సినిమాలు లేక డీలా పడుతున్న ప్రేక్షకులకి కాస్త ఉపశమనం అందించేందుకు మేకర్స్ చిత్రం నుండి తమిళ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లుక్‌‌ను విడుదల చేసింది. 
 
సైరా తర్వాత విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన లుక్‌లో చేతిలో సిగరేట్‌తో రాజసంతో కూడిన మాస్ విలన్ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది.

రయనం అనే పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం భార్యతో పూరి జగన్నాథ్‌ను కొట్టించిన చిరంజీవి ట్వీట్