తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చేస్తున్న చివరి సినిమా దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని ప్రారంభించారు. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. హెచ్.వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
జన నాయగన్ అనే మూవీ టైటిల్ అర్థం అందరికీ తెలిసిందే. జన నాయకుడు.. పీపుల్స్ లీడర్.. ప్రజా నాయకుడు అని అర్థం వస్తుంది. ఇన్నేళ్లలో విజయ్ చేసిన సేవా కార్యక్రమాలు, సినీ పరిశ్రమలో సాధించిన విజయాలకు చిహ్నంగా ఈ టైటిల్ ఉంది. ఈ చిత్రంతో అనిరుధ్ మరోసారి తన సంగీతంతో విజయ్ అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు సిద్దంగా ఉన్నారు.
జన నాయగన్ టైటిల్ పోస్టర్లో దళపతి విజయ్ ఎంతో స్మార్ట్‌గా కనిపిస్తున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ పోస్టర్‌లోని సెల్ఫీకి, ఆ టైటిల్‌కి న్యాయం చేసినట్టుగా కనిపిప్తోంది. ఈ మూవీని విజయ్‌కి ఫేర్ వేల్‌గా ఉండబోతోంది. అభిమానులు ఈ సినిమాను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేలా ఉంటుంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. లైనప్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్ మున్ముందు మరిన్ని చిత్రాలను అందించనుంది.