తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఏదో హడావుడిలో తమ కాళ్లకు చెప్పులున్నాయనే విషయాన్ని మర్చిపోయామని నయనతార భర్త విఘ్నేశ్ శివన్ అన్నారు. వెంకన్నపై తమకు ఎంతో నమ్మకం వుంది. దయచేసి మమ్మల్ని క్షమించండి.. అంటూ విఘ్నేశ్ శివన్ ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు.
"తిరుమలలో పెళ్లి చేసుకోవాలన్నదే తమ కోరిక. అందుకే గత నెల రోజుల్లో తిరుమలకు ఐదుసార్లు వచ్చాం. కానీ అనివార్య కారణాల వల్ల మహాబలిపురంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.
దీంతో పెళ్లి అయిన వెంటనే నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారి కల్యాణ సేవలో పాల్గొనేందుకు వచ్చామని.. అదే ఆలోచనలో స్వామి వారి దర్శనానికి తర్వాత చెప్పులేసుకుని వచ్చేశామని విక్కీ తెలిపారు.
దర్శనం తర్వాత ఆలయం ముందు ఫోటోలు తీసుకున్నది.. మా పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోవాలనే ఉద్దేశంతోనేనని విఘ్నేశ్ చెప్పారు. ఆ హడావుడిలోనే చెప్పులున్న సంగతిని మర్చిపోయామని వెల్లడించారు.