Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యాబాలన్ నా బయోపిక్‌లో నటిస్తే బాగుంటుంది: సన్నీ లియోన్

పోర్న్ స్టార్ కమ్ హీరోయిన్ సన్నీలియోన్ కూడా బయోపిక్‌లపై ఆశలు పెట్టుకుంది. బాలీవుడ్‌లో వచ్చిన కొత్త ల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. కానీ వాటిని అధిగమించి ప్రస్తుతానికి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది

Advertiesment
Vidya Balan to Play Sunny Leone in Her Biopic?
, బుధవారం, 28 డిశెంబరు 2016 (11:09 IST)
పోర్న్ స్టార్ కమ్ హీరోయిన్ సన్నీలియోన్ కూడా బయోపిక్‌లపై ఆశలు పెట్టుకుంది. బాలీవుడ్‌లో వచ్చిన కొత్త ల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. కానీ వాటిని అధిగమించి ప్రస్తుతానికి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాజా చిత్రం 'రాయిస్'లో ఆమె స్టెప్పులేసిన 'లైలా మే లైలా' పాట సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఫుల్ ఖుష్‌గా ఉంది సన్నీ. 
 
ఈ సందర్భంగా సన్నీలియోన్ మాట్లాడుతూ.. సినిమాల్లో నటించేందుకు తాను ఎలాంటి షరతులు విధించుకోలేదని స్పష్టం చేసింది. స్క్రిప్ట్ బాగుంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా పాత్రకు న్యాయం చేకూరుస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల పర్వం కొనసాగుతోందని, ఒకవేళ తన జీవిత చరిత్రను సినిమాగా తీస్తే, అందులో తన పాత్రలో విద్యాబాలన్ నటించాలని కోరుకుంటున్నానని తెలిపింది. తన పాత్రకు విద్యాబాలన్ అయితేనే న్యాయం చేయగలదని విశ్వసించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీవీ శాటిలైట్ రైట్స్ : 'ఖైదీ నం.150'ను బీటే చేయలేక పోయిన 'గౌతమిపుత్రశాతకర్ణి'?