ప్రభాస్ తల్లిగా బాలీవుడ్ స్టార్.. బాలయ్య సోదరి..?

బుధవారం, 22 జనవరి 2020 (18:38 IST)
డార్లింగ్ తన ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేలా కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ప్రభాస్ 20వ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ''జాన్'' అనే టైటిల్‌తో కొత్త సినిమా రూపుదిద్దుకుంటోంది. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రూ.160 కోట్ల బడ్జెట్‌. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.
 
తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ అలనాటి హీరోయిన్ నటించనుంది. ప్రభాస్ తల్లిగా బాలీవుడ్ నటి భాగ్య శ్రీ నటిస్తున్నారట. ఈ పాత్రకు గల ప్రాధాన్యతను బట్టి ఆమెను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.


భాగ్య శ్రీ.. నందమూరి హీరో బాలయ్య నటించిన రాణా చిత్రంలో ఆయనకు సోదరిగా నటించింది. ఈ చిత్రం 1998లో విడుదలైంది. మళ్లీ 22 సంవత్సరాల తర్వాత ప్రభాస్ సినిమా ద్వారా భాగ్య శ్రీ రీ ఎంట్రీ ఇవ్వనుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్రగతి గ్లామర్ అదరహో... ఆ ఫోటోలతో ఊపేస్తోంది...