Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలీవుడ్ అలనాటి తార రీమా లగూ ఇక లేరు..

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు వదినగా నటించిన.. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒదిగిపోయి.. బుల్లితెరపై ఆకట్టుకున్న బాలీవుడ్ అలనాటి నటి రీమా లగూ ఇకలేరు. అమ్మ పాత్రలకు వన్నె తెచ్చి.. ప్రముఖ హీర

బాలీవుడ్ అలనాటి తార రీమా లగూ ఇక లేరు..
, గురువారం, 18 మే 2017 (12:45 IST)
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు వదినగా నటించిన.. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒదిగిపోయి.. బుల్లితెరపై ఆకట్టుకున్న బాలీవుడ్ అలనాటి నటి రీమా లగూ ఇకలేరు. అమ్మ పాత్రలకు వన్నె తెచ్చి.. ప్రముఖ హీరోలకు తల్లిగా నటించిన రీమా లగూ.. గురువారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె ముంబైలోని బెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గుండెపోటు కారణంగా కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. 
 
హిందీ, మరాఠీ భాషల్లో పలు ధారావాహికల్లో నటించిన ఈమె.. 1970, 80 దశకంలో బాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందారు. ఖయామత్ సే ఖయామత్ తక్, సాజన్, దిల్ వావలే, కుచ్ కుచ్ హోతాహై, దిల్ తేరా దివానా తదితర సినిమాలో రీమ లగూ నటించారు. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'మైనే ప్యార్ కియా'లో సల్మాన్‌కు తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. 
 
1958లో జన్మించిన రీమా.. బుల్లి తెరపై వచ్చిన 'శ్రీమాన్ శ్రీమతి'లో నటించి ఎంతో మంది అభిమానుల సంపాదించుకున్నారు. కామెడీ సీరియల్ 'తు తు మై మై'లో కూడా నటించారు. సపోర్టింగ్ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. 1990 మైనే ప్యార్ కియా చిత్రానికి సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకోగా, 1991 ఆషికి చిత్రానికి సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. 
 
ఇంకా 1995 హహ్ ఆప్ కే హై కౌన్ చిత్రానికి సపోర్టింగ్ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. 2000 వాస్తవ్ చిత్రానికి సపోర్టింగ్ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డును కైవసం చేసుకున్నారు. ఇలా ఎన్నో అవార్డులు ఆమె సినీ ఖాతాలో ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుశాంత్ తండ్రి మృతి.. విషాదంలో అక్కినేని ఫ్యామిలీ