బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్‌కు తీవ్ర అస్వస్థత.. తీవ్ర జ్వరం.. దగ్గు..
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన అలనాటి నటుడు దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయనకు బుధవారం ఉన్నట్టుండి ఎడమకాలి
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన అలనాటి నటుడు దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయనకు బుధవారం ఉన్నట్టుండి ఎడమకాలికి తీవ్రమైన నొప్పి, వాపు రావడంతో ఆయన్ని హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు.
ఈ విషయమై దిలీప్‌సతీమణి సైరాభాను మీడియాతో మాట్లాడుతూ.. 'నేనే ఆయన్ని సాధారణ వైద్య పరీక్షలకు తీసుకెళ్లాలనుకున్నా. కానీ ఆయనే కాలు నొప్పిగా ఉందన్నారు. తీవ్రమైన దగ్గు, జలుబు కూడా ఉంది. ఆయన ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపను. అందుకే ఆయన నొప్పి అనగానే వెంటనే ఆస్పత్రిలో చేర్పించాను. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు. దేవుడి దయ వల్ల పుట్టినరోజు నాటికి ఆయన ఇంట్లో ఉంటే బాగుంటుంది' అన్నారు.