Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ పుకార్లతో మనశ్శాంతి లేకుండా ఉంది.. అవన్ని నిజాలు కాదు.. వేణుమాధవ్ కన్నీటి రోదన

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా నటుడు వేణుమాధవ్‌పై వస్తున్న పుకార్లకు విసిగిపోయిన ఆయన తాజాగా పోలీసులను ఆశ్రయించారు. వేణుమాధవ్‌‌పై గత కొద్ది కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అన‌తికాలంలోనే అగ్ర‌శ్ర

ఆ పుకార్లతో మనశ్శాంతి లేకుండా ఉంది.. అవన్ని నిజాలు కాదు.. వేణుమాధవ్ కన్నీటి రోదన
, మంగళవారం, 1 నవంబరు 2016 (09:02 IST)
టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా నటుడు వేణుమాధవ్‌పై వస్తున్న పుకార్లకు విసిగిపోయిన ఆయన తాజాగా పోలీసులను ఆశ్రయించారు. వేణుమాధవ్‌‌పై గత కొద్ది కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అన‌తికాలంలోనే అగ్ర‌శ్రేణి హాస్య‌న‌టుల జాబితాలో చేరిన వేణుమాధ‌వ్ ఇప్పుడు తెర‌పై క‌నిపించ‌డంలేదు. అవ‌కాశాలు రావ‌డంలేదా? లేదా అనారోగ్యం పాల‌య్యాడా? ఇవే అనుమానాలు అభిమానులలో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గిలిగింత‌లు పెట్టే వేణుమాధ‌వ్ కామెడీ సీన్ల‌ను ఏ బుల్లితెర‌పై చూసినా, యూట్యూబ్‌లో వేణుమాధ‌వ్ కామెడీ సీన్స్ సెర్చ్ కొట్టిన‌ప్పుడు ఒక్క‌సారిగా మ‌న‌ ముందు మెదులుతారు వేణుమాధ‌వ్‌. 
 
దిల్‌, ల‌క్ష్మి, కిక్‌, సింహాద్రి, సై వంటి సినిమాల‌తో పాటు వంద‌ల సినిమాల‌లో న‌టించిన వేణుమాధ‌వ్ ఏమ‌య్యారు? ఎక్క‌డున్నారు? అని అభిమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒకానొక సమయంలో వేణు చనిపోయాడని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్త‌ల‌తో తాను తీవ్ర మాన‌సికక్షోభ‌కు గుర‌య్యానంటూ వేణుమాధవ్ మీడియా ముందుకొచ్చి.. అవన్ని నిజాలు కాదని వాపోతున్నారు. అయినా తనపై వస్తున్న రూమర్లు మాత్రం ఆగటం లేదు. అయితే తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. తను మీడియా ముందుకొచ్చి.. ఏడ్చిన వీడియో ఇది. మీరు చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బే నాకెలాంటి కోలీవుడ్ ఛాన్సులు రాలేదు.. ఎంతిచ్చినా నచ్చితేనే చేస్తా: సాయి పల్లవి