Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అబ్బే నాకెలాంటి కోలీవుడ్ ఛాన్సులు రాలేదు.. ఎంతిచ్చినా నచ్చితేనే చేస్తా: సాయి పల్లవి

మలయాళ ప్రేమమ్ తెలుగులో కూడా ప్రేమమ్‌ పేరుతోనే రిలీజ్ అయ్యింది. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో సాయి పల్లవి పాత్రలో శృతిహాసన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మలయాళ ప్రేమమ్ హీరోయిన్‌ సా

అబ్బే నాకెలాంటి కోలీవుడ్ ఛాన్సులు రాలేదు.. ఎంతిచ్చినా నచ్చితేనే చేస్తా: సాయి పల్లవి
, సోమవారం, 31 అక్టోబరు 2016 (17:49 IST)
మలయాళ ప్రేమమ్ తెలుగులో కూడా ప్రేమమ్‌ పేరుతోనే రిలీజ్ అయ్యింది. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో సాయి పల్లవి పాత్రలో శృతిహాసన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మలయాళ ప్రేమమ్ హీరోయిన్‌ సాయి పల్లవి కోలీవుడ్ ఆఫర్ తిరస్కరించిందని వార్తలొచ్చాయి. ఓ సినిమాలో హాట్ సీన్ చేసేందుకు అమ్మడును సంప్రదించారని కానీ అందుకు ఆమె నో చెప్పిందని వార్తలొచ్చాయి. 
 
ఇవన్నీ వదంతులేనని పల్లవి కొట్టిపారేసింది. అసలు తనకు ఎలాంటి కోలీవుడ్ ఆఫర్ రాలేదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి హ్యాపీడేస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న ఫిదా మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నానని చెప్పింది. 
 
తమన్నాను ఇంట్రడ్యూస్ చేసిన శేఖర్ కమ్ముల.. సాయి పల్లవిని కూడా అదే రేంజ్‌లో చూపించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి మాట్లాడుతూ.. రెమ్యునరేషన్ అధికంగా ఇస్తామన్నా తనకు నచ్చిన రోల్సే చేస్తానని తేల్చి చెప్పేసింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లరి నరేష్ సరసన అమలాపాల్.. ఒప్పేసుకుందా?