Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

Snkranthi song

డీవీ

, మంగళవారం, 24 డిశెంబరు 2024 (06:22 IST)
Snkranthi song
విక్టరీ వెంకటేష్ హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్ టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మొదటి రెండు పాటలకు చార్ట్‌బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగల్ గోదారి గట్టు గ్లోబల్ టాప్ 20 వీడియోస్ లిస్టు లో ప్రవేశించగా, సెకండ్ సింగిల్ మీను కూడా అన్ని మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో ఉంది.
 
మేకర్స్ సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్ మేకర్స్ ప్రారంభించారు. భీమ్స్ సిసిరోలియో సంక్రాంతి ఫెస్టివల్ వైబ్ ని హైలైట్ చేసే మరో అద్భుతమైన నెంబర్ ని కంపోజ్ చేశారు. ఆర్‌ఎఫ్‌సీలో వేసిన వైబ్రైంట్ సెట్ లో హీరో వెంకటేష్, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ పై ఈ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. పోస్టర్‌లో వెంకటేష్ ఐశ్వర్య, మీనాక్షి , ఇతరులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇక్కడ అందరూ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు.
 
ఈ ఎనర్జిటిక్, కలర్‌ఫుల్ నంబర్ కు భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సాంగ్ సినిమా మెయిన్ హైలైట్‌లలో ఒకటిగా ఉంటుంది. 
 
వెంకటేష్ ఎక్స్ పోలీస్ పాత్రలో, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించనున్నారు.  
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి నిర్వహిస్తుండగా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి