Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూర్తి స్క్రిప్ట్‌ ఎప్పుడూ చదవలేదు : వెంకటేష్‌

''దర్శకురాలు సుధ స్క్రిప్ట్‌ మొత్తం చదవాలంది. ఇదేమిటి.. ఎప్పుడూలేనిది కొత్తగా అనిపించింది. నా కెరీర్‌లో నా క్యారెక్టరేంటి, డైలాగ్స్‌ ఏంటని చదివేవాడినే కానీ పూర్తి స్క్రిప్ట్‌ ఎప్పుడూ చదవలేదు. కాస్త కొత్తగా అనిపించినా, సరేనని స్క్రిప్ట్‌ మొత్తం చదివాన

Advertiesment
venkatesh comments on guru movie
, మంగళవారం, 21 మార్చి 2017 (20:23 IST)
''దర్శకురాలు సుధ స్క్రిప్ట్‌ మొత్తం చదవాలంది. ఇదేమిటి.. ఎప్పుడూలేనిది కొత్తగా అనిపించింది. నా కెరీర్‌లో నా క్యారెక్టరేంటి, డైలాగ్స్‌ ఏంటని చదివేవాడినే కానీ పూర్తి స్క్రిప్ట్‌ ఎప్పుడూ చదవలేదు. కాస్త కొత్తగా అనిపించినా, సరేనని స్క్రిప్ట్‌ మొత్తం చదివాను. ఒక కొత్త ఎనర్జీ వచ్చినట్లు అనిపించింది. ఈ సినిమాలో నేను పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అయ్యి నటించాను. సుధ నా పాత సినిమాలన్నీ చూసి నా ముఖ కవళికలు ఎక్కడా రిపీట్‌ కాకుండా కొత్తగా ఉండేలా చూసుకుంది. ఈ సినిమాలో నేను బాక్సింగ్‌ కోచ్‌ అంటే గురువుగా పనిచేశాను. కానీ సినిమా చేసే సమయంలో సుధ, నాకు గురువు అయ్యింది'' అని వెంకటేష్‌ అన్నారు.
 
వెంకటేష్‌, రితిక సింగ్‌ ప్రధాన తారాగణంగా వై నాట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై సుధా దర్శకత్వంలో ఎస్‌.శశికాంత్‌ నిర్మించిన చిత్రం 'గురు'. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్‌ మాట్లాడారు. బాక్సింగ్‌ గ్రౌండ్‌ తరహాలోనే స్టేజ్‌ని అలంకరించి వేడుక నిర్వహించారు. వెంకటేష్‌ మాట్లాడుతూ..  నా 30 ఏళ్ళ కెరీర్‌లో ఎన్నో జోనర్‌ మూవీస్‌లో నటించాను. ఎన్నో అవార్డ్స్‌, రివార్డ్స్‌ వచ్చాయి. ఈ జర్నీలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ 30 ఏళ్ళలో నేర్చుకున్నదంతా ఒకటైతే గురు సినిమా సమయంలో నేర్చుకున్నది ఒకటి. అందుకు కారణం దర్శకురాలు సుధ కొంగర. 
 
ఈ సినిమాను ముందుగా నేనే చేయాల్సింది కానీ జ్వరంతో చేయలేకపోయాను. హిందీ, తమిళంలో రూపొందిన ఈచిత్రాన్ని తమిళంలో విడుదల కాకముందే చూశాను. నాకు నచ్చింది. సినిమా చేద్దామనుకున్నాను. సుధ స్క్రిప్ట్‌ తీసుకొచ్చి ఇచ్చి పూర్తిగా చదవమంది. నా నుండి బెస్ట్‌ అవుట్‌ పుట్‌ తీసుకుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో జింగిడి సాంగ్‌ కూడా నేను పాడాను. ట్యూన్‌ వినగానే ఎగ్జయిట్‌ అయ్యాను. సంతోష్‌ నారాయణ్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. ఈ సినిమాతో నా ఆలోచన కొత్తగా మారింది. కొత్త క్యారెక్టర్స్‌ ఏదైనా చేసేయవచ్చుననే ఫీలింగ్‌ వచ్చింది. రితిక, ముంతాజ్‌లు చక్కగా నటించారు. తప్పకుండా గురు సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిజమే... నేను కూడా ఆ విషయంలో వారితో రాజీ పడ్డా... కాజల్ అగర్వాల్