Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిజమే అప్పుడు చితక్కొట్టా... ఇప్పుడు ప్రేమగా చూస్కుంటా... కరిగిన వీణా మాలిక్, ఒప్పేసుకుంది

భర్తకు వీణా మాలిక్ విడాకులు ఇచ్చేసిందని జోరుగా ప్రచారం సాగింది. అయితే అసలు కారణం ఏమిటో వీణా మాలిక్ పాక్ టీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. భార్యాభర్తలైన వీణా మాలిక్-అజాద్‌ను కలిపేందుకు.. వీరిద్ద

నిజమే అప్పుడు చితక్కొట్టా... ఇప్పుడు ప్రేమగా చూస్కుంటా... కరిగిన వీణా మాలిక్, ఒప్పేసుకుంది
, శుక్రవారం, 17 మార్చి 2017 (15:16 IST)
పాకిస్థాన్‌కు చెందిన నటీమణి వీణా మాలిక్ బాలీవుడ్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆపై 2013లో పారిశ్రామిక వేత్త అజాద్ కటక్‌ను పెళ్లాడింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వీరిద్దరూ విడాకులతో విడిపోవాలనుకున్నారు. ఇందులో భాగంగా లాహోర్ కోర్టును వీణా మాలిక్‌ ఆశ్రయించింది. పచ్చగా ఉన్న సంసారం నుంచి వీణామాలిక్ విడాకులు తీసుకోవాలనుకుంటున్నందుకు కారణం ఆమెకు సినిమాల పట్ల ఉన్న మోజేనని వార్తలు వచ్చాయి.

సినిమాల కోసమే ఆమె భర్తకు దూరమైందని.. బాలీవుడ్‌లో పెళ్లైనా సన్నీలియోన్ రాణిస్తుండటంతో తాను కూడా బిటౌన్‌లో మెరిసిపోవాలనుకుని... భర్తకు వీణా మాలిక్ విడాకులు ఇచ్చేసిందని జోరుగా ప్రచారం సాగింది. అయితే అసలు కారణం ఏమిటో వీణా మాలిక్ పాక్ టీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 
 
భార్యాభర్తలైన వీణా మాలిక్-అజాద్‌ను కలిపేందుకు.. వీరిద్దరిని కలిపి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. తాను వీణా మాలిక్ వద్ద క్షమాపణ కోరుతున్నట్లు అజాద్ తెలిపాడు. అయితే దీన్ని వినిన వీణా మాలిక్ ముందుగా నిరాకరించింది. ఆయన చేసిన రెండు విషయాలను తాను ఎప్పటికీ క్షమించబోనని తెలిపింది. అజాద్ తనను కొట్టాడని, పలుమార్లు అవమానించాడని తద్వారా మానసికంగా, శారీరకంగా ఆవేదనకు గురిచేశాడని.. చెప్పింది. 
 
కానీ బషీర్ మాత్రం ఇకపై వీణా మాలిక్‌ను ప్రేమతో చూసుకుంటానని.. తనతో కలిసి జీవించాలని రాత పూర్వకంగా రాసివ్వడంతో.. వీణా మాలిక్ భర్తను క్షమించానని చెప్పింది. భర్తకు తాను రెండో ఛాన్స్ ఇస్తున్నానని.. కోర్టు ఆమోదంతో ఆయనతో కలిసి జీవించేందుకు సుముఖంగా ఉంటానని తెలిపింది. పిల్లల కోసం తాను ఈ నిర్ణయానికి వచ్చానని వీణా తెలిపింది.
 
పిల్లల భవిష్యత్తు కోసం తాను వీణా మాలిక్‌ను దూరం చేసుకోదలచుకోలేదని బషీర్ వెల్లడించడంతో వీణా వెనక్కి తగ్గినట్లు సమాచారం. దీంతో అజాద్ కటక్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వీణాతో తనకున్న సంబంధాన్ని గుర్తు చేస్తూ... లవ్లీ పోస్టుల్ని షేర్ చేశాడు. ఇందుకు వీణా కూడా సానుకూలంగా స్పందించింది. గత మూడు నెలలుగా విడిగా వుంటున్న వీణా-కటక్ త్వరలో కలిసి జీవించనున్నారు. 
 
తన పిల్లలైన అబ్రామ్ (2), అమల్ (1) కోసం వీణా మాలిక్ తన భర్తతో కలిసి జీవించనుంది. అజాద్ కూడా తమ సంతానం కోసం తమ విబేధాలను పక్కనబెట్టి ఆనందమయ జీవితాన్ని గడిపేందుకు రెడీ అయిపోయాడు. సో.. వీణా మాలిక్- అజాద్‌లా సెలెబ్రిటీలు తమ వ్యక్తిగత హోదాలను పక్కనబెట్టి.. సర్దుకుపోతే.. పిల్లల భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందని.. ఇతరులకు ఆదర్శప్రాయమవుతారని సినీ పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలియా భట్ బనానా కామెంట్స్.. ఈ డబుల్ మీనింగ్ మాటలేంటో?