నాగబాబు కుమార్తె నీహారిక.. ఒక మనసు.. టీజర్ ఇటీవలే విడుదలైంది. అందులో జంట నాగశౌర్య, నీహారిక బాగున్నారని స్పందన వస్తోంది. టీజర్‌లో ఆమె బాగా నటించినట్లు.. సోదరుడు వరుణ్‌తేజ్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే మెగా అభిమానుల్లో ఆ టీజర్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు.
మా ఫ్యామిలీ అంతా ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాం. మాలో అందరికంటే చిన్న పిల్ల తనే. క్యూట్ లిటిల్ ప్రిన్సెస్. ఇప్పుడు చూడండి.. తెరమీద ఇరగదీస్తోంది. ఎంతో ప్రౌడ్ మూమెంట్ ఇది'' అంటున్నాడు.
నిహారికను అలా చూస్తే చాలా హ్యాపీగా ఉందని నాకు చరణ్ అన్న ఫోన్ చేసి చెప్పాడు. మా అందరి సపోర్టుతో... తను ఎప్పుడు తొలి రిలీజ్‌ను చూస్తుందా అని ఎదురుచూస్తున్నాం'' అన్నాడు వరుణ్. అంతే కాదు.. అందరి మాటలు.. త్వరలో ఆడియోనాడు త్వరలో విందాం మరి.