Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరుణ్ సందేశ్ పక్కదారి పట్టాడా?అతి విశ్వాసంతో '100% లవ్‌'ను వదులుకున్నాడా?

వరుణ్ సందేశ్ పక్కదారి పట్టాడా?అతి విశ్వాసంతో '100% లవ్‌'ను వదులుకున్నాడా?
, బుధవారం, 25 మే 2016 (13:01 IST)
శేఖర్‌ కమ్ముల 'హ్యాపీడేస్‌'తో కెరీర్‌ మొదలు పెట్టిన వరుణ్‌సందేశ్‌.. ఆ తర్వాత కొద్దికొద్దిగా ఎదుగుతూ.. 'కొత్తబంగారులోకం'తో మంచి గుర్తింపు పొందాడు. అయితే ఆ తర్వాత చిత్రాలు ఆయనకు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. కెరీర్‌ బాగున్నప్పుడే సరైన అడుగులు వేయాలనేది సినిమా రూలు. అందుకు తల్లిదండ్రులు స్నేహితులు సూచనలుకూడా వుపయోగపడతాయి. కానీ వరుణ్‌ కొంచెం పక్కదారి పట్టాడని తెలుస్తోంది. 
 
కొత్త దర్శకులతో చేసిన 'ఎవరైన ఎపుడైన' సినిమా బాగా నిరాశపర్చింది. ఆ తర్వాత వెంటనే.. మంచు ఫ్యామిలీతో 'పాండవులు..' సినిమాలో ఓ పాత్ర పోషించాడు. అయితే వ్యక్తిగత సమస్యలు కొన్ని బయటకు రావడంతో వరుణ్‌పై సరైన దృక్పథం దర్శక నిర్మాతలకులేకపోయిందని తెలుస్తోంది. ఓ నటితో డేటింగ్‌ చేస్తున్నాడని వార్త ప్రధానంగా విన్పించింది. ఆ సమయంలోనే రెండు చిత్రాలను తను వదులుకున్నట్లు సినీవర్గాలు పేర్కొంటున్నాయి. 
 
'100% లవ్‌', 'గుండె జారి గల్లంతయ్యిందే' కథలు వచ్చినా తన ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తోవాటిని వదులుకున్నాడని చెబుతున్నారు. ఆ చిత్రం విడుదలై మంచి సక్సెస్‌లు సాధించడంతో కలతచెందినట్లు సమాచారం. అందుకే ప్రస్తుతం వస్తున్న అవకాశాల్ని వదులుకోకుండా 'మిస్టర్‌ 420' సినిమాలో నటించాడు. అయితే ఈ చిత్రం ఆరంభంనుంచి కొన్ని రూల్స్‌ పెట్టడం... ఆ చిత్ర దర్శక నిర్మాతలకు తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. చిత్ర ప్రమోషన్‌లోకూడా రాకపోవడం విమర్శలకు తావిచ్చినట్లయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి 150వ సినిమా.. జూన్ 6 నుంచి సెట్స్‌పైకి.. అనుష్క హీరోయిన్!