Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి 150వ సినిమా.. జూన్ 6 నుంచి సెట్స్‌పైకి.. అనుష్క హీరోయిన్!

చిరంజీవి 150వ సినిమా.. జూన్ 6 నుంచి సెట్స్‌పైకి.. అనుష్క హీరోయిన్!
, బుధవారం, 25 మే 2016 (12:54 IST)
చిరంజీవి 150వ సినిమా అదిగో ఇదిగో అంటూ.. ఊరిస్తున్న అభిమానులకు ఎట్టకేలకు సెట్‌పైకి వెళ్లే డేట్‌ను ఫిక్స్‌ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకుంది. ఇక తాజాగా జూన్‌ 6న సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నట్లు టీమ్‌ ప్రకటించింది. వినాయక్‌ చిరంజీవి స్థాయికి సరిపడేలా అన్ని హంగులతో కథనాన్ని మలుచుకున్నట్లు సమాచారం. 
 
తమిళ 'కత్తి'కి రీమేక్‌ అయినా తెలుగులో కావాల్సిన అంశాలు పొందుపరిచారు. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి రామ్‌ చరణ్‌ స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో చిరు సరసన అనుష్క హీరోయిన్‌గా నటించనున్నారు. వచ్చే సంక్రాంతి సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు 'కత్తిలాంటోడు' అనే టైటిల్‌ ప్రస్తుతం పరిశీలనలో ఉంది. అయితే ఇది వర్కింగ్‌ టైటిల్‌అనీ.. అసలు టైటిల్‌ కాదని ప్రచారంకూడా జరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాస్‌ ఏంజిల్స్‌లో శభాష్‌ నాయుడు‌: బ్రహ్మానందం, అక్షర, శ్రుతిహాసన్‌లతో..!